నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (National Institute of Malaria Research)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్టు రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్ (Project Assistant), ప్రాజెక్టు టెక్నిషియన్ (Technician) పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 8 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు అర్హత వివరాలు తెలుసుకొనేందుకు https://nimr.org.in/notifications/vacancies వెబ్సైట్ (Website)ను సందర్శించాలి. అప్లికేషన్ (Application) విధానం పూర్తిగా ఆన్లైన్ (Online) ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
రీసెర్చ్ అసిస్టెంట్ | సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేసి మూడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 |
సీనియర్ ప్రాజెక్టు రీసెర్చ్ ఫెలో | లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 |
ప్రాజెక్టు అసిస్టెంట్ | సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేసి మూడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 |
ప్రాజెక్టు టెక్నీషిన్ -lll | 12వ తరగతి పాసై ఉండాలి, మెడికల్ (Medical) లాబొరేటరీలో టెక్నాలజీలో డిప్లామ ాచేసి ఉండాలి. ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించి ఉండకూడదు. | 02 |
ప్రాజెక్టు టెక్నీషిన్ -l | పదోతరగతి పూర్తి చేసి ఐటీఐ సర్టిఫికెట్ (Certificate) చేసి ఉండాలి. సైన్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. వయసు 25 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 |
ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటీవ్ సపోర్టు | పదో తరగతి పాసై ఉండాలి. వయసు 25 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 |
IREL Recruitment 2021: ఐఆర్ఈఎల్లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
ఎంపిక విధానం..
- ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థి విద్యార్హత, అకడామిక్ మెరిట్ (Merit), వృత్తి అనుభవం (Work Experience) ద్వారా ఎంపిక ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థి అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను సెల్ఫ్ అటెస్టు (Self attest) చేసి అందించాలి.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- కేవలం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://nimr.org.in/notifications/vacancies నుసందర్శించాలి.
- నోటిఫికేషన్లో అర్హత వివరాలను క్షుణ్ణంగా చదవాలి ( నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- దరఖాస్తు కోసం అప్లె ఆన్‌లైన్‌ను క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు పూర్తిగా తమ విద్యార్హత వివరాలు అందించి సబ్మిట్ చేయాలి
- దరఖాస్తు అనంతరం అప్లికేషన్ ఫాం హార్డుకాపీని (Hard copy) ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 3, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS