NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

NIMHANS Recruitment 2021 | బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ 275 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్-NIMHANS ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 275 ఖాళీలను ప్రకటించింది. నర్సింగ్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nimhans.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    NIMHANS Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 275
    నర్సింగ్ ఆఫీసర్- 266
    టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ)- 1
    సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులర్)- 1
    కంప్యూటర్ ప్రోగ్రామర్- 1
    జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్- 1
    స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్- 3
    సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనెటిక్స్)- 1
    అసిస్టెంట్ డైటీషియన్- 1

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    NIMHANS Recruitment 2021: వేతనాల వివరాలు ఇవే...


    నర్సింగ్ ఆఫీసర్- రూ.44,990
    టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ)- రూ.35,400
    సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులర్)- రూ.67,700
    కంప్యూటర్ ప్రోగ్రామర్- రూ.35,400
    జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్- రూ.44,900
    స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్- రూ.35,400
    సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనెటిక్స్)- రూ.35,400
    అసిస్టెంట్ డైటీషియన్- రూ.35,400

    NIMHANS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 28 సాయంత్రం 4.30 గంటలు
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- 30 నుంచి 40 ఏళ్లు
    దరఖాస్తు ఫీజు- గ్రూప్ ఏ పోస్టులకు రూ.2,360. గ్రూప్ బీ పోస్టులకు రూ.1,180.

    TVVP Recruitment 2021: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు... మే 31 లాస్ట్ డేట్

    IBPS RRB 2021: నిరుద్యోగులూ బీ రెడీ... ఈ బ్యాంకు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

    NIMHANS Recruitment 2021: దరఖాస్తు విధానం


    అభ్యర్థులు ముందుగా https://nimhans.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    కెరీర్స్ సెక్షన్‌లో నోటిఫికేషన్ ఉంటుంది.
    నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
    అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
    దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    The Director, NIMHANS,
    P.B.No.2900, Hosur Road,
    Bengaluru – 560 029.
    Published by:Santhosh Kumar S
    First published: