నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (National Institute Of Mental Health & Neuro Sciences) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్ క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, యోగా థెరపిస్ట్, డేటా మేనేజర్, సోషల్‌వర్కర్ , ఆఫీసర్ అసిస్టెంట్ (Officer Assistant) , రీసెర్చ్ అసోసియేట్ (Research Associate) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 56 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులను కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన నియమించనున్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://nimhans.ac.in/ లో కెరీర్ వివరాలు సందర్శించండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీల సంఖ్య |
సైకియాట్రిక్ సోషల్ వర్కర్ | సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సైక్రియార్టిక్ సోషల్ వర్క్ లో ఎంఫిల్ చేసి ఉండాలి. | 22 |
క్లినికల్ సైకాలజిస్ట్ | సైకాలజీలో మాస్టర్ డిగ్రీ (Master Degree) ఉండాలి. సంబంధిత రంగంలో ఎంఫిల్ చేసి ఉండాలి. | 13 |
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ | బయో కెమిస్ట్రీలో (Bio Chemistry) ఎంఎస్సీ చేసి ఉండాలి. ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. | 06 |
యోగా థెరపిస్ట్ | యోగాలో ఎంఎస్సీ (MSc) చేసి ఉండాలి. ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. | 01 |
ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ | బయోలజికల్ సైన్స్ లో ఎంఎస్సీ, లేదా బయో టెక్నాలజీలో బీటెక్ చేసి ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. | 01 |
డేటా మేనేజర్ | సోషల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యేయేట్ చేసి ఉండాలి. | 02 |
ఫాలో అప్ కౌన్సిలర్ | సోషల్ సైన్స్ (Social Science) లో డిగ్రీ చేసి ఉండాలి | 03 |
సైకాలజిస్ట్ | ఎంఎస్సీ సైకాలజీ చేసి ఉండాలి. | 02 |
సోషల్ వర్కర్ | సోషల్ వర్క్ లో ఎంఎస్సీ చేసి ఉండాలి | 03 |
క్కోహోర్ట్ మేనేజర్ | క్లినికల్ సైకాలజీలో ఎంఫీల్ (M.phil) చేసి ఉండాలి. | 01 |
ఆఫీసర్ అసిస్టెంట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి. | 01 |
రీసెర్చ్ అసోసియేట్ | కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (Graduate) డిగ్రీ చేసి ఉండాలి. | 01 |
ఎంపిక విధానం..
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
- కట్ ఆఫ్ నిర్ణయం, ఎంపికలో తుది నిర్ణయం సంస్థదే
CCMB Hyderabad: సీసీఎంబీ హైదరాబాద్‌లో సైంటిస్ట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో చేయాలి.
Step 2 : ముందుగా పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ https://nimhans.ac.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. (అప్లికేషన్ ఫాం కోసం డౌన్ చేసుకోవడానికి క్లిక్ చేయండి)
Step 4 : అనంతరం ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 5 : నింపిన దరఖాస్తు ఫాంను కింది అడ్రస్‌కు పంపాలి.
Registrar,
NIMHANS,
P.B.No.2900,
Hosur Road,
Bengaluru – 560 029
Step 6 :దరఖాస్తు ఫాం చేరేందుకు చివరి తేదీ అక్టోబర్ 15, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS