హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NIIH: స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. జీతం రూ. 64వేలు..

Jobs In NIIH: స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. జీతం రూ. 64వేలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ, చంద్రపూర్ లో పలు పోస్టుల భర్తీ జరగనుంది. దీని కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సైంటిస్ట్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ, చంద్రపూర్(NIIH Chandrapur) లో పలు పోస్టుల భర్తీ జరగనుంది. దీని కోసం నోటిఫికేషన్(Notification) జారీ చేశారు. సైంటిస్ట్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇచ్చిన లింక్(Link) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 06 అక్టోబర్ 2022.

మొత్తం పోస్టులు సంఖ్య 05

కేటగిరీల వారీగా ఖాళీలు ఇలా..

పోస్టు పేరుఖాళీల సంఖ్య
సైంటిస్ట్ సీ(మెడికల్)01
మెడికల్ సోషల్ వర్కర్01
స్టాఫ్ నర్స్01
డేటా ఎంట్రీ ఆపరేటర్02

వయో పరిమితి సైంటిస్ట్ పోస్టులకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. సోషల్ వర్కర్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, స్టాఫ్ నర్స్ పోస్టులకు 30 ఏళ్ల లోపు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థి యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ - 22 సెప్టెంబర్, 2022

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 06 అక్టోబర్, 2022

IT Jobs 2022: ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా.. ఈ కంపెనీలో 10 వేల ఖాళీలకు నియామకాలు..

సైంటిస్ట్ - ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా MBBS / BAMS / BHMS వరకు విద్యను పూర్తి చేసి ఉండాలి. కనీసం నాలుగేళ్ల అనుభవం కూడా ఉండాలి.

మెడికల్ సోషల్ వర్కర్ - ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సోషియాలజీ/ఎంఎస్‌డబ్ల్యూలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

స్టాఫ్ నర్స్ - ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లొమా నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీని కలిగి ఉండాలి. (GNM) వరకు చదివి ఉండాలి. కనీస అనుభవం కలిగి ఉండటం కూడా అవసరం.

డేటా ఎంట్రీ ఆపరేటర్ - ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.  అంతే కాకుండా.. MS ఆఫీస్ వచ్చి ఉండాలి. కనీస అనుభవం కలిగి ఉండటం కూడా అవసరం.

జీతం ఇలా..

సైంటిస్ట్ - నెలకు రూ.64,000 + 2775- HRA

మెడికల్ సోషల్ వర్కర్ - నెలకు రూ.32,000

స్టాఫ్ నర్స్ - నెలకు రూ. 31,500

డేటా ఎంట్రీ ఆపరేటర్ - నెలకు రూ 18,000 చెల్లిస్తారు.

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

దరఖాస్తు చేసే సమయంలో ఈ పత్రాలు దగ్గర పెట్టుకోండి..

రెజ్యూమ్ (బయోడేటా)

10వ, 12వ మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు

స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్

కుల ధృవీకరణ పత్రం (వెనుకబడిన తరగతి అభ్యర్థులకు)

గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్)

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

దరఖాస్తు ఇలా..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://niih.org.in/projectappli/ ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించవచ్చు.

పూర్తి వివరాలకు పీడీఎఫ్ డౌన్ లోడ్ కు ఇక్కడ క్లిక్ చేయండి

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Mumbai

ఉత్తమ కథలు