హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIFT Recruitment 2022: నిఫ్ట్‌లో 190 ఉద్యోగాలు... రూ.56,100 వేతనం

NIFT Recruitment 2022: నిఫ్ట్‌లో 190 ఉద్యోగాలు... రూ.56,100 వేతనం


8 . ఐఓటీ (IoT) అండ్ అప్లికేషన్ కోర్స్ - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things) అనేది కాస్త సంక్లిష్ట‌మైన స‌బ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది. టీసీఎస్ ఈ కోర్సులో అందించే ఉదాహ‌ర‌ణ‌ల కోసం పైథాన్‌ని ప్రాథమిక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ (Programming Language) తోపాటు రాస్ప్‌బెర్రీ పై పరికరాన్ని ఎంచుకుంది. కోర్సు ఎనిమిది వారాలు ఉంటుంది. ప్ర‌స్తుతం కోర్సు ధ‌ర రూ.17,700గా సంస్థ నిర్ణ‌యించింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8 . ఐఓటీ (IoT) అండ్ అప్లికేషన్ కోర్స్ - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things) అనేది కాస్త సంక్లిష్ట‌మైన స‌బ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది. టీసీఎస్ ఈ కోర్సులో అందించే ఉదాహ‌ర‌ణ‌ల కోసం పైథాన్‌ని ప్రాథమిక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ (Programming Language) తోపాటు రాస్ప్‌బెర్రీ పై పరికరాన్ని ఎంచుకుంది. కోర్సు ఎనిమిది వారాలు ఉంటుంది. ప్ర‌స్తుతం కోర్సు ధ‌ర రూ.17,700గా సంస్థ నిర్ణ‌యించింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

NIFT Recruitment 2022 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 190 ఖాళీలు ఉన్నాయి. న్యూఢిల్లీలోని నిఫ్ట్‌లో పోస్టింగ్ లభిస్తుంది. ఇవి ఫుల్ టైమ్ పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. విద్యార్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

NIFT Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు190
అన్‌రిజర్వ్‌డ్77
ఎస్‌సీ27
ఎస్‌టీ14
ఓబీసీ53
ఈడబ్ల్యూఎస్19


Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్... ఇలా అప్లై చేయండి

NIFT Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 31

దరఖాస్తులు పోస్టులో పంపడానికి చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 15

విద్యార్హతలు- పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ

అనుభవం- టీచింగ్ లేదా రీసెర్చ్ ఎక్స్‌పీరియెన్స్ ఒకటి నుంచి మూడేళ్ల మధ్య ఉండాలి.

వయస్సు- 2022 జనవరి 31 నాటికి 40 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు ఫీజు- రూ.1,180. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, నిఫ్ట్ ఉద్యోగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ.

వేతనం- ఏడో పే కమిషన్ లెవెల్ 10 వేతనం వర్తిస్తుంది. రూ.56,100 బేసిక్ వేతనంతో పాటు అలవెన్సులు లభిస్తాయి.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 61 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

NIFT Recruitment 2022: దరఖాస్తు చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు నిఫ్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్ https://nift.ac.in/careers ఓపెన్ చేయాలి.

Step 2- అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్‌లో CLICK HERE TO APPLY ONLINE పైన క్లిక్ చేయాలి.

Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 4- ఆ తర్వాత విద్యార్హతల వివరాలు, ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.

Step 5- ఫోటో, సంతకం, సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 7- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.

Step 8- అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2022 ఫిబ్రవరి 15 లోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Registrar, Head Office,

NIFT Campus, Hauz Khas,

New Delhi - 110016.

First published:

Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు