Home /News /jobs /

NICPR Recruitment 2020: నిరుద్యోగులకు NICPR శుభవార్త.. రూ. 32 వేల వేతనంతో ఉద్యోగాలు

NICPR Recruitment 2020: నిరుద్యోగులకు NICPR శుభవార్త.. రూ. 32 వేల వేతనంతో ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ICMR-NICPR) శుభవార్త చెప్పింది. పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    నిరుద్యోగులకు నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(NICPR) శుభవార్త చెప్పింది. 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది. టెక్నీషియన్, టెక్నికల్ ఆఫీసర్, ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకాలను చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు ప్రవర్తన సరిగా లేకపోయినా.. వారి పనితీరు సంతృప్తిగా లేకపోయినా.. అలాంటి వారికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తామని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
    ఖాళీల వివరాలు..
    కాంట్రాక్ట్ టెక్నీషియన్-2 పోస్టులు
    కాంట్రాక్ట్ టెక్నికల్ ఆఫీసర్-15
    కాంట్రాక్ట్ అన్ స్కిల్డ్ స్టాఫ్-2

    విద్యార్హతలు..
    Contract Technician: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ పాసై, DMLT పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టు కోసం ఎంపికైన వారికి రూ. 18 వేల వేతనం ఉంటుంది.

    Contract Technical Officer: లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో((Zoology, Botany, Micro-biology, Bio-technology or any relevant field) డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో డిగ్రీ చదివిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు. దీంతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 30 ఏళ్లకు మించొద్దు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 32 వేల వేతనం చెల్లించనున్నారు.
    Contract Unskilled Staff: హై స్కూల్, అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయస్సు 25 ఏళ్లకు మించి ఉండొద్దు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 15, 800 వేతనం చెల్లించనున్నారు.

    ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకుని నింపాల్సి ఉంటుంది. వయస్సు నిర్ధారణ, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్ల ధ్రువపత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల రోజే ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అసంపూర్తిగా నింపిన దరఖాస్తులు, ఫొటో అతికించనివి, సంతకాలు లేనివి అంగీకరించబడవు. అలాంటి దరఖాస్తు పత్రాలతో వచ్చిన వారిని ఇంటర్వ్యూలకు అనుమతించరు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో పొందు పర్చారు.
    Official Notification Download Here
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: ICMR, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు