కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ఉద్యోగాల (Govt Jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 300 స్కేల్ 1 కేడర్‌లో ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 21 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్‌కు (Job Notification) సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ లేదా పీజీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండొచ్చు. మరి ఈ పోస్టులకు ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కోసం ఏం చదవాలి, తెలుసుకోండి.
ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 243 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టీవ్ టైప్‌లో ఉంటుంది. 100 మార్కులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. మూడు సెక్షన్లకు వేర్వేరు టైమింగ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులు, క్వాంటిటేటీవ్ ఆబ్జెక్టీవ్ 35 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మూడు సెక్షన్లకు 20 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. పోస్టుల సంఖ్య కన్నా 15 రెట్లు మెయిన్ ఎగ్జామ్‌కు క్వాలిఫై అవుతారు. అంటే 4500 మందిని మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది.
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 174 ఖాళీలు... అప్లై చేయండి ఇలా
మెయిన్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టీవ్ టెస్ట్‌కు 200 మార్కులు, డిస్క్రిప్టీవ్ టెస్ట్‌కు 30 మార్కులు ఉంటాయి. ఈ రెండు పరీక్షలు ఆన్లైన్లోనే ఉంటాయి. ఆబ్జెక్టీవ్ టెస్ట్ 2.5 గంటలు ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ టాపిక్స్‌పై 50 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉంటాయి. డిస్క్రీప్టీవ్ టెస్ట్ 30 నిమిషాలు ఉంటుంది. 30 మార్కులు కేటాయిస్తారు. ఇందులో లెటర్ రైటింగ్‌కు 10 మార్కులు, ఎస్సేకు 20 మార్కులు ఉంటాయి.
డిస్క్రిప్టీవ్ టెస్ట్ కూడా ఆన్లైన్ పరీక్ష కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్లో సమాధానాలు టైప్ చేయాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌లో తప్పు సమాధానాలకు పెనాల్టీ ఉంటుంది. ప్రతీ నాలుగు తప్పులకు ఒక మార్కు తగ్గుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్స్ క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ వెయిటేజీ 75:25 చొప్పున ఉంటుంది. మెయిన్స్ క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తుంది ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Insurance, Job notification, JOBS