Home /News /jobs /

NIACL Recruitment 2021: ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్... రూ.62,000 వేతనం... రేపే లాస్ట్ డేట్

NIACL Recruitment 2021: ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్... రూ.62,000 వేతనం... రేపే లాస్ట్ డేట్

NIACL Recruitment 2021: ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్... రూ.62,000 వేతనం... రేపే లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

NIACL Recruitment 2021: ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్... రూ.62,000 వేతనం... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

NIACL Recruitment 2021 | భారత ప్రభుత్వానికి చెందిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (The New India Assurance Company Ltd) మొత్తం 300 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application process) సెప్టెంబర్ 21న ముగుస్తుంది.

ఇంకా చదవండి ...
    ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్-NIACL ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ సంస్థలో స్కేల్ 1 కేడర్‌లో ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల భర్తీకి ఈరోజు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తోంది ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్-NIACL. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 21 చివరి తేదీ. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. పోస్టు ద్వారా, ఇతర పద్ధతుల్లో పంపే అప్లికేషన్స్‌ని కంపెనీ స్వీకరించదు. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఫీజు వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.



























    మొత్తం ఖాళీలు 300
    ఎస్‌సీ 46
    ఎస్‌టీ 22
    ఓబీసీ 81
    ఈడబ్ల్యూఎస్ 30
    అన్‌రిజర్వ్‌డ్ 121

    APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 398 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

    NIACL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 1

    ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 21

    దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2021 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు

    ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టీవ్)- 2021 అక్టోబర్

    ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టీవ్+డిస్క్రిప్టీవ్)- 2021 నవంబర్

    SBI SCO Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    NIACL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో పాస్ అయితే చాలు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. 2021 సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ పూర్తి చేసినట్టు తర్వాత సర్టిఫికెట్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది.

    వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.100.

    ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.

    వేతనం- రూ.32,795 బేసిక్ వేతనంతో మొత్తం రూ.62,315 వేతనం లభిస్తుంది.

    ఇతర నిబంధనలు- డ్యూటీలో చేరినప్పటి నుంచి ఒక ఏడాది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబెషన్ పీరియడ్ సమయంలో ఆఫీసర్లు ఇన్స్యూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. ఈ పరీక్ష పాస్ అయితేనే ఉద్యోగుల సేవల్ని కంపెనీ కొనసాగిస్తుంది. ప్రొబెషనర్స్‌గా చేరడానికి ముందే నాలుగేళ్లు కంపెనీలో పనిచేస్తామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

    పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో, తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

    Jobs in Wipro: విప్రోలో ఫ్రెషర్స్‌కి 30,000 ఉద్యోగాలు... ఏడాదికి రూ.3,50,000 వేతనం

    NIACL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://www.newindia.co.in/ వెబ్‌సైట్‌లో Recruitment సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో CLICK HERE TO APPLY ONLINE పైన క్లిక్ చేయాలి.

    Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

    Step 4- ఆ తర్వాత Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- పేరు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 6- ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి.

    Step 7- ఈ వివరాలు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.

    Step 8- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి

    Step 9- విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 10- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 11- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 12- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు