హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టెనోగ్రాఫర్‌తో(Stenographer) సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెక్షన్ ఆఫీసర్/ఆఫీస్ సూపరింటెండెంట్ (SO/OS), అసిస్టెంట్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని nia.gov.inని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగావకాశానికి అర్హులైన అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ను 28 జూలై 2022న విడుదల చేశారు. ఆగస్టు 28 వరకు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించనున్నారు.
పోస్టుల వివరాలిలా..
ఉద్యోగం పేరు | పోస్టుల ఖాళీలు |
సెక్షన్ ఆఫీసర్/ఆఫీస్ సూపరింటెండెంట్ | 03 |
అసిస్టెంట్ | 09 |
అకౌంటెంట్ | 01 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ | 23 |
యూడీసీ(UDC) | 12 |
వేతన వివరాలు ఇలా.. సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 7 కింద నెలకు రూ. 44,900 నుండి రూ. 142400 వరకు జీతం ఇవ్వబడుతుంది. అసిస్టెంట్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు నెలకు రూ.35400 నుంచి రూ.112400 వేతనం ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు నెలకు రూ.25500 నుంచి రూ.81100 వేతనం ఇవ్వనున్నారు.
దరఖాస్తు విధానం ఇలా.. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తును సూచించిన ఫార్మాట్‌లో అవసరమైన డాక్యుమెంట్‌లను 28 ఆగస్టు 2022న లేదా అంతకు ముందు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు పంపవచ్చు. నిర్ణీత సమయం తర్వాత పంపిన దరఖాస్తులు ఆమోదించబడవు. దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా ఇదే.. NIA Hqrs, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూ ఢిల్లీ -110003. పూర్తి వివరాలకు నోటఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Centre government, JOBS, New jobs, NIA, Recruitment