ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్ లు (Job Notifications) విడుదలవుతన్న విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలు (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జాబ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అప్రంటీస్ విధానంలో (Apprentice) ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. జాబ్స్ సాధించిన అభ్యర్థులు NHPC, Tanakpur లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో పని చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.
ఖాళీలు, విద్యార్హల వివరాలు..
మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. టెన్త్ తో పాటు ఐటీఐ (ITI) పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ట్రేడ్ల (Trade) వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రేడ్ | ఖాళీలు |
మెకానిక్ MV(Mechanic MV) | 6 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (Computer operator and programming assistant) | 7 |
ఎలక్ట్రీషియన్ (Electrician) | 8 |
ఫిట్టర్ (Fitter) | 7 |
వైర్ మెన్ (Wireman) | 2 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టెమ్ మెయింటెనెన్స్ (Information Technology and Electronics System Maintenance) | 4 |
వెల్డర్ (Welder) | 2 |
వయోపరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 1 నాటికి 14 ఏళ్లు పూర్తయి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇప్పటికే అప్రంటీస్ ట్రైనింగ్ తీసుకున్న వారు.. గతంలో అప్రంటీస్ ట్రైనింగ్ ను మధ్యలో వదిలేసిన వారు ఈ శిక్షణకు అనర్హులు.
TCIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. TCILలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేయండి
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు ముందుగా http://apprenticeindia.org/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 2: అనంతరం లాగిన్ వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
Step 3: అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసిన అనంతరం ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
Step 4: తర్వాత విద్యార్హతల సర్టిఫికేట్లు, ఐటీఐ మార్క్స్ షీట్, ఆధార్ ప్రూఫ్ కాపీ, పాన్ ప్రూఫ్ ను NHPC, Tanakpur చిరునామాకు పోస్ట్ లో పంపించాలి.
Step 5: అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apprenticeship, Central Government Jobs, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS