Home /News /jobs /

NHPC RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 53 NEW VACANCIES SALARY RS 50000 HERE APPLICATION PROCESS NS

NHPC Recruitment 2021: డిగ్రీ చేసిన వారికి శుభవార్త.. NHPCలో రూ. 1.60 లక్షల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

డిగ్రీ చేసిన వారికి శుభవార్త.. NHPCలో రూ. 1.60 లక్షల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

డిగ్రీ చేసిన వారికి శుభవార్త.. NHPCలో రూ. 1.60 లక్షల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 53 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. గేట్ 2021(GATE-2021) లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుది. ఈ నేపథ్యంలో GATE-2021 ఎగ్జామ్ రాసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షలు చెల్లించనున్నారు.

    ఖాళీల వివరాలు:































    పోస్టుఖాళీలు
    ట్రైనీ ఇంజనీర్(సివిల్)29
    ట్రైనీ ఇంజనీర్(మెకానికల్)20
    ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్)4
    ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)12
    ట్రైనీ ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ)2
    మొత్తం67

    BMRC Recruitment 2021: బీటెక్, డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి గుడ్ న్యూస్.. మెట్రో రైల్ కార్పొరేషన్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి
    విద్యార్హతల వివరాలు..

    ట్రైనీ ఇంజనీర్(సివిల్): సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    ట్రైనీ ఇంజనీర్(మెకానికల్): మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్): సీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ): కంపెనీ సెక్రటరీ విద్యార్హత ఉన్న అభ్యర్థి ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    BEL Recruitment 2021: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి అలర్ట్.. బీఈఎల్ లో రూ.35 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
     Step 2: అనంతరం హోం పేజీలో Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం నోటిఫికేషన్ కింద Click here for online application అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


    Step 4: అనంతరం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదటగా మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టును సెలక్ట్ చేసుకోవాలి.
    Step 5: తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
    Step 6: అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు