నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) కింద యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు NHB అధికారిక వెబ్‌సైట్ nhb.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 12 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 17 పోస్టులు భర్తీ చేయబడతాయి.
ఈ ఖాళీలు బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్ జమ్మూ/శ్రీనగర్, కోల్‌కతా, నాసిక్, పూణే, విజయవాడ , భోపాల్, గ్వాలియర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలోని ఒక్కో NHB సెంటర్‌కి ఉన్నాయి. అర్హత, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య – 17
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: నవంబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 02
అర్హత:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/హార్వెస్ట్ టెక్నాలజీ/అగ్రికల్చర్ ఎకనామిక్స్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్/ఫుడ్ టెక్నాలజీ/ఫుడ్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు అగ్రికల్చర్/హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
లేదా
హార్టికల్చర్/అగ్రికల్చర్‌లో గ్రాడ్యుయేట్, అగ్రిబిజినెస్‌లో MBA కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థులు కంప్యూటర్ (MS Office, PowerPoints, Excel, మొదలైనవి) నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
జీతం.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50వేలు నెలవారీ జీతం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-దీనిలో టాప్ లో కనిపిస్తున్న టెండర్ లేదా వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. దానిలో పేర్కొన్న వివరాలను చదువుకోవాలి.
-Apply Application for Young Professional అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-ఇక్కడ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయమని అడుగుతంది. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే.. అప్లికేసన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
-దీనిలో మీ వివరాలను తప్పులు లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
-చివరకు అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి.
-దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు సంతకం చేసి.. మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ప్లాట్ 85, సెక్టార్ 18, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, గురుగ్రామ్ (హర్యానా) పిన్ 122015కి పంపించాల్సి ఉంటంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.