హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NFL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లో రూ.1.40 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్..

NFL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లో రూ.1.40 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజే లాస్ట్ డేట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా(Corona) ప్రభావం కాస్త తగ్గడంతో దేశ వ్యాప్తంగా నియామకాలు(jobs) జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పలు ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్(Job Notification) సైతం విడుదలైంది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఇప్పటికే ఈ నెల 3న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ రోజు అంటే ఈ నెల 23ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీల వివరాలు..


S.Noపోస్టు ఖాళీలు
1.మేనేజ్మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)12
2.మేనేజ్మెంట్ ట్రైనీ(HR)12
మొత్తం 24


విద్యార్హతల వివరాలు..

Management Trainee(Marketing): ఎమ్మెస్సీ(అగ్రికల్చర్) లేదా MBA/PGDCM(Marketing/Agri Business Marketing/ International Marketing/Rural Marketing) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) చేసి ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితి 18-29 ఏళ్లు ఉండాలి.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Management Trainee(HR): 60 శాతం మార్కులతో MBA/PG Degree లేదా Diploma చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు 18-29 ఏళ్లు ఉండాలి.

Jobs In Telangana: మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.nationalfertilizers.com/ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం Recruitment of MT (Marketing) & MT (HR) in NFL- 2021 ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 4: కావాల్సిన వివరాలను నమోదు చేయాలి.

AP Job Mela: ఏపీలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 18,500 వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

Step 5:  విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలి.

Step 6:  తర్వాత వివరాలను సరి చూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 7: అప్లై చేసే సమయంలో అభ్యర్థులు రూ. 700ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Step 8: అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని ఆ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి

First published:

Tags: Career and Courses, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు