కరోనా(Corona) ప్రభావం కాస్త తగ్గడంతో దేశ వ్యాప్తంగా నియామకాలు(jobs) జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పలు ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్(Job Notification) సైతం విడుదలైంది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఇప్పటికే ఈ నెల 3న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 23ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
పోస్టు | ఖాళీలు |
మేనేజ్మెంట్ ట్రైనీ(మార్కెటింగ్) | 12 |
మేనేజ్మెంట్ ట్రైనీ(HR) | 12 |
మొత్తం | 24 |
విద్యార్హతల వివరాలు..
Management Trainee(Marketing): ఎమ్మెస్సీ(అగ్రికల్చర్) లేదా MBA/PGDCM(Marketing/Agri Business Marketing/ International Marketing/Rural Marketing) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) చేసి ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితి 18-29 ఏళ్లు ఉండాలి.
Management Trainee(HR): 60 శాతం మార్కులతో MBA/PG Degree లేదా Diploma చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు 18-29 ఏళ్లు ఉండాలి.
ECIL Recruitment 2021: ఈసీఐఎల్ లో రూ. 23 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.nationalfertilizers.com/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Recruitment of MT (Marketing) & MT (HR) in NFL- 2021 ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4: కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
Step 5: అప్లై చేసే సమయంలో అభ్యర్థులు రూ. 700ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS