HOME »NEWS »JOBS & EDUCATION »nfl recruitment 2021 apply online for 30 vacancies here details ns

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.



    -కెమికల్ విభాగంలో మొత్తం నాలుగు ఖాళీలను భర్తీ చేస్తుననారు. కెమికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినవారు దరఖాస్తుకు అర్హులు.
    -మెకానికల్ విభాగంలో మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
    -ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
    ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లే.. 2021లో అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే.. తెలుసుకోండి
    నిరుద్యోగులకు అలర్ట్.. IOCLలో ఉద్యోగాల దరఖాస్తుకు మరో 4 రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి

    -Instrumentation విభాగంలో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆయా సబ్జెక్టులో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    -కెమికల్ ల్యాబ్ లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

    -ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో మొత్తం 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    ఎలా అప్లై చేయాలంటే..
    ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21లోగా సంస్థ అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రూ. 700 అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwBD, ExSM అభ్యర్థులకు ఫీజులు మినహాయింపు ఉంటుంది.
    Official Notification
    Published by:Nikhil Kumar S
    First published:January 12, 2021, 15:37 IST