Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NFL Recruitment 2020 | లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జాబ్ నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-NFL పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: August 27, 2020, 12:50 PM IST
Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-NFL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ, ప్రొడక్షన్ విభాగాల్లో ఇంజనీర్, మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 40 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nationalfertilizers.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.

NHPC Recruitment 2020: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 ట్రైనీ ఉద్యోగాలు

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

NFL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 40
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 25విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు 60% మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- ఇంజనీర్ పోస్టుకు 30 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 45 ఏళ్ల లోపు.
అనుభవం- విద్యార్హతలతో పాటు ఇంజనీర్ పోస్టుకు ఏడాది అనుభవం, మేనేజర్ పోస్టుకు 9 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Chief Manager (HR),
National Fertilizers Limited,
A-11, Sector-24, Noida,
District Gautam Budh Nagar,
Uttar Pradesh – 201301.
Published by: Santhosh Kumar S
First published: August 27, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading