Jobs: నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

NFL Recruitment 2020 | బీటెక్ పాసైనవారు, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL.

news18-telugu
Updated: May 25, 2020, 3:36 PM IST
Jobs: నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
Jobs: నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. మొత్తం 52 ఖాళీలతో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు మే 27న ముగుస్తుందని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కానీ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేస్తోంది నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL. ఇంజనీర్, మేనేజర్, సీనియర్ కెమిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలను https://www.nationalfertilizers.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఎరువుల కంపెనీ. రసాయన, సేంద్రీయ ఎరువులతో పాటు పరిశ్రమలకు కావాల్సిన రసాయనాలను, ఇతర ఉత్పత్తులు ఈ కంపెనీలో తయారవుతాయి.

NFL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



ఇంజనీర్ (ప్రొడక్షన్)- 1
మేనేజర్ (ప్రొడక్షన్)- 16
ఇంజనీర్ (మెకానికల్)- 5
మేనేజర్ (మెకానికల్)- 12
ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 3మేనేజర్ (ఎలక్ట్రికల్)- 2
ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 5
ఇంజనీర్ (సివిల్)- 1
సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్)- 6
ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ)- 1

NFL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు చివరి తేదీ- 2020 జూన్ 30
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ లాంటి విభాగాల్లో బీటెక్, బీఈ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు ఫీజు- రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
General Manager (HR),
National Fertilizers Limited,
A-11, Sector-24, Noida,
District Gautam Budh Nagar,
Uttar Pradesh – 201301

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్‌సీ

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: May 25, 2020, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading