Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే

NFL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు www.nationalfertilizers.com వెబ్‌సైట్‌లో పోస్టులు, విద్యార్హతల వివరాలను చూడొచ్చు. పోస్ట్ ద్వారా దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: October 14, 2019, 5:20 PM IST
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 14, 2019, 5:20 PM IST
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ఎరువుల కంపెనీ నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఎరువుల కంపెనీ. రసాయన, సేంద్రీయ ఎరువులతో పాటు పరిశ్రమలకు కావాల్సిన రసాయనాలను, ఇతర ఉత్పత్తులు ఈ కంపెనీలో తయారవుతాయి. సీనియర్ కెమిస్ట్, మేనేజర్, మెడికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 270 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 10న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 16 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.nationalfertilizers.com వెబ్‌సైట్‌లో పోస్టులు, విద్యార్హతల వివరాలను చూడొచ్చు. పోస్ట్ ద్వారా దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NFL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 270

సీనియర్ కెమిస్ట్- 30
మేనేజర్- 45
సీనియర్ మేనేజర్- 45


ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫీసర్- 30
Loading...
మెడికల్ ఆఫీసర్ (మెడిసిన్ / పీడియాట్రిక్ / ఈఎన్‌టీ / డెంటల్): 120
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 16
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
General Manager (HR),
National Fertilizers Limited,
A-11, Sector-24, Noida,
District Gautam Budh Nagar,
Uttar Pradesh - 201301.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్... వివరాలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...