హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEXT 2023: బిగ్ అలర్ట్.. నీట్-పీజీ, FMGE పరీక్షల విలీనం.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌..

NEXT 2023: బిగ్ అలర్ట్.. నీట్-పీజీ, FMGE పరీక్షల విలీనం.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌..

NEXT 2023

NEXT 2023

NEXT 2023: చివరి సంవత్సరం MBBS విద్యార్థులకు కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ అందించడం కోసం ఈ పరీక్షను ప్రవేశపెట్టనున్నారు. వివిధ వైద్య కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష ఒక అర్హత ప్రమాణంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నీట్-పీజీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) కనుమరుగు కానున్నాయి. ఈ రెండు పరీక్షలను విలీనం చేసి, వచ్చే ఏడాది నుంచి కొత్తగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను (NEXT) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- న్యూ ఢిల్లీ (AIIMS- New Delhi)... నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) భాగస్వామ్యంతో ఈ కొత్త పరీక్ష (New Exam)ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు 23న ఫైల్ చేసిన ఓ పిటిషన్‌కు, ఆర్టీఐ పంపిన రిప్లై‌ను ఎడ్యుకేషన్ కౌన్సెలర్ డాక్టర్ అశిష్ మహేంద్ర షేర్ చేశారు. ఈ వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి ఎన్‌ఎంసీ(NMC), కామన్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షను నిర్వహించనుంది.చివరి సంవత్సరం MBBS విద్యార్థులకు కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ అందించడం కోసం ఈ పరీక్షను ప్రవేశపెట్టనున్నారు. వివిధ వైద్య కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష ఒక అర్హత ప్రమాణంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
“NMC చట్టం 2019లోని సెక్షన్ (15) 1 ప్రకారం.. NMC కామన్ ఫైనలియర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షను నిర్వహిస్తుంది. మెడికల్ ప్రాక్టీషనర్లుగా మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన లైసెన్స్ మంజూరు చేయడానికి, స్టేట్ మెడికల్ రిజిస్టర్‌ లేదా నేషనల్ మెడికల్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని కూడా పిలువనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్ష అమలు చేయనున్నారు. అయితే ఎన్‌ఎంసీ వెల్లడించే మార్గదర్శకాల తరువాత పరీక్ష విధివిధానాలు స్పష్టంగా తెలుస్తాయి.’’ అని ఆర్టీఐ రిప్లైలో పేర్కొంది.


మెడికల్ ఎడ్యుకేషన్ కోసం మెడికల్ ఫైనల్ ఇయర్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ను కేంద్రప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. ప్రాక్టీసింగ్ లైసెన్స్ పొందాలంటే తప్పనిసరిగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది ఇలా ఉంటే.. మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఎన్‌ఎంసీ.. జులై 2021లో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జూన్‌లోపు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను పరీక్ష ఉంటుందని, పరీక్ష ప్యాట్రన్‌ను అర్థం చేసుకోవడానికి విద్యార్థుల కోసం ఒక మాక్ టెస్ట్ రిలీజ్ చేస్తామని అందులో పేర్కొంది. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి : ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు ఐఐటీ గాంధీనగర్ బంపరాఫర్.. త్వరపడండి..
ఈ స్క్రీనింగ్ టెస్ట్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పరీక్ష సరళి, పరీక్ష నిర్వహణ తేదీపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) స్పష్టత ఇవ్వాలని నీట్-పీజీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది లైసెన్సులు కోరుకునే మెడికల్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పరీక్షగా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌లలోకి ప్రవేశించడానికి అర్హత పరీక్షగా పనిచేయనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET

ఉత్తమ కథలు