డిజిటల్ జర్నలిజంలో సత్తాచాటాలనుకుంటున్నారా? రిపోర్టర్ గా మారి ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారా? అయితే.. తెలుగులో నంబర్.1 న్యూస్ వెబ్ సైట్ అయిన న్యూస్18 తెలుగు (News18 Telugu) శుభవార్త చెబుతోంది. రిపోర్టర్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి సదవకాశాన్ని అందిస్తోంది. న్యూస్ 18లో పలు జిల్లాలకు సంబంధించి రిపోర్టర్ల నియామకం (Reporters Recruitment) చేపడుతోంది. తద్వారా ఇంగ్లీష్, తెలుగు సహా 12 భారతీయ భాషల్లో వెబ్ సైట్లను కలిగిన నెట్ వర్క్ 18లో (Network18) లో చేరే అవకాశాన్ని కల్పిస్తోంది న్యూస్18. తద్వారా మీరు మీ ప్రాంతానికి ప్రతినిధిగా, ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీగా, స్టార్‌గా మారొచ్చు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని వివిధ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఖాళీలు వివరాలు:
క్ర.సం | జిల్లా పేరు |
1. | హైదరాబాద్ |
2. | రంగారెడ్డి |
3. | వరంగల్ |
4. | భద్రాద్రి కొత్తగూడెం |
5. | యాదాద్రి భువనగిరి |
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
క్ర.సం | జిల్లా పేరు |
1. | శ్రీకాకుళం |
2. | విజయనగరం |
3. | వెస్ట్ గోదావరి |
4. | ఈస్ట్ గోదావరి |
5. | క్రిష్ణ (మచిలీపట్నం) |
6. | నెల్లూరు |
7. | ప్రకాశం |
8. | కడప |
9. | అనంతపురం |
అర్హతలు:
1. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి.
2. వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి.
3. మీరు ఏ జిల్లాలో నివసిస్తున్నారో ఆ జిల్లాలో ఖాళీ ఉంటే దరఖాస్తు చేయాలి. వేరే జిల్లా కోసం చేయవద్దు.
4. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మీద పట్టు ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమె (Resume)ను మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. news18jobs@gmail.com లేదా ramana.p@nw18.com మెయిల్ కు అభ్యర్థులు తమ రెజ్యూమె ను పంపించాల్సి ఉంటుంది. మీరు నివసించే ప్రాంతంలో బాగా ట్రెండీగా, ఆసక్తికరంగా ఉండే అంశంపై 3 నుంచి 5 నిమిషాల వీడియో స్టోరీ తీసి Resume తో పాటుగా పంపండి. అది మీ చుట్టూ ఉండే జనం గురించి కావొచ్చు. ప్లేస్, ఫుడ్, ఫ్యాషన్, జాబ్స్, క్రీడలు ఏవైనా కావొచ్చు. కొత్తగా, ప్రత్యేకంగా అనిపించేదై ఉండాలి. ఆ వీడియోను అప్ లోడ్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, News18, Private Jobs