డిజిటల్ జర్నలిజంలో సత్తాచాటాలనుకునే యువతకు న్యూస్ 18 తెలుగు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. రిపోర్టర్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి సదవకాశాన్ని అందిస్తోంది. న్యూస్ 18లో పలు జిల్లాలకు సంబంధించి రిపోర్టర్ల నియామకం చేపడుతోంది. ఐతే ఈ నెల 10 వరకు ఉన్న అప్లికేషన్ గడువును ఏప్రిల్ 15వరకు పెంచారు. అంటే ఇవాళే ఆఖరిరోజు. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇవాళ అర్ధరాత్రి లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ న్యూస్ 18 తెలుగు (News18 Telugu) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంగ్లీష్, తెలుగు సహా 12 భారతీయ భాషల్లో వెబ్ సైట్లను కలిగిన నెట్ వర్క్ 18లో (Network18) మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? డిజిటల్ జర్నలిజంలో (Digital Journalist) మీ సత్తా చాటాలని అనుకుంటున్నారా? మీరు మీ ప్రాంతానికి ప్రతినిధిగా, ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీగా, స్టార్‌గా మారాలనుకుంటున్నారా? మీరు 30 ఏళ్ల కంటే తక్కువ వయసువారా? అయితే, న్యూస్18 మీ కోసమే ఎదురుచూస్తోంది. మీరు చెప్పాలనుకునే స్టోరీకి న్యూస్ 18 వేదిక కల్పిస్తోంది. మీకు రిపోర్టింగ్ అవకాశం కల్పిస్తుంది.
ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
తెలంగాణ: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, భద్రాచలం, సిరిసిల్ల, యాదాద్రి
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, మచిలీపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం.
#News18 నుంచి గుడ్ న్యూస్.. రిపోర్టర్ల అప్లికేషన్ గడువు 15 వరకు పొడిగింపు.
అర్హతలు
1. 30 ఏళ్ల లోపు ఉండాలి.
2. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
3. మీరు నివసిస్తున్న జిల్లా కోసమే దరఖాస్తు చేయాలి.
4. డిజిటల్, సోషల్ మీడియా మీద పట్టు ఉండాలి.
అప్లికేషన్ లింక్: https://t.co/aAGcnaIbfP pic.twitter.com/iTzcDhB5Qu
— News18 Telugu (@News18Telugu) April 10, 2022
అర్హతలు (Qualification for News18 Jobs)
1. కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జర్నలిజం డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు.
2. వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి
ఎలా అప్లై చేయాలి? (How to Apply for New18 Jobs)
ఈ క్రింద ఎంబెడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేయండి.
Step 1: మొదట మీ పేరు వివరాలు నింపండి
Step 2: మీరు ఏ జిల్లా కోసం దరఖాస్తు చేస్తున్నారో సెలక్ట్ చేయండి
Step 3: మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి.
Step 4: మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
Step 5: మీ అడ్రస్, ఇతర వివరాలు నింపండి
Step 6: మీ పుట్టిన రోజు వివరాలు ఎంటర్ చేయండి.
Step 7: మీ రెజ్యూమ్ అప్ లోడ్ చేయండి.
Step 8: మీ గురించి, ఎందుకు మీరు ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీగా ఉండాలనుకుంటున్నారో ఓ 2 నిమిషాల సెల్ఫీ వీడియో తీసి అప్ లోడ్ చేయండి. (వీడియో mp4 ఫార్మాట్‌లోనే ఉండాలి)
Step 9: మీరు నివసించే ప్రాంతంలో బాగా ట్రెండీగా, ఆసక్తికరంగా ఉండే అంశంపై 3 నుంచి 5 నిమిషాల వీడియో స్టోరీ తీసి పంపండి. అది మీ చుట్టూ ఉండే జనం గురించి కావొచ్చు. ప్లేస్, ఫుడ్, ఫ్యాషన్, జాబ్స్, క్రీడలు ఏవైనా కావొచ్చు. కొత్తగా, ప్రత్యేకంగా అనిపించేదై ఉండాలి. ఆ వీడియోను అప్ లోడ్ చేయండి. (వీడియో mp4 ఫార్మాట్‌లోనే ఉండాలి)
Step 10: అన్ని వివరాలు ఒకసారి చూసుకుని Submit మీద క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫాం ఫిల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Note: మీ ఎంట్రీలు పంపవలసిన చివరి తేదీ 15-04-2022.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, JOBS, News18, Telangana