Home /News /jobs /

NEWLY UPDATED NEET 2022 WEBSITE FULL DETAILS THAT CANDIDATES NEED TO KNOW BEFORE NOTIFICATION GH VB

NEET 2022: కొత్తగా అప్‌డేట్ అయిన నీట్ 2022 వెబ్‌సైట్.. నోటిఫికేషన్‌కు ముందు అభ్యర్థులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2022 నిబంధనల ప్రకారం వెబ్‌సైట్ అప్‌డేట్ అయింది. ఈ మార్పు నీట్ నోటిఫికేషన్ త్వరలోనే రావడానికి ఒక సూచన అని నిపుణులు భావిస్తున్నారు.

వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న ఔత్సాహికుల కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గతంలో ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2022 నిబంధనల ప్రకారం వెబ్‌సైట్ అప్‌డేట్ అయింది. ఈ మార్పు నీట్ నోటిఫికేషన్ త్వరలోనే రావడానికి ఒక సూచన అని నిపుణులు భావిస్తున్నారు. మెడికల్ ఎంట్రన్స్(Medical Entrance) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఈ ఏడాది నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందని భావిస్తున్నారు. నీట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే MBBS, BDSతో పాటు ఇతర అనుబంధ వైద్య రంగాల్లో అడ్మిషన్ పొందడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో మెడిసిస్ చదువుకోవడానికి అర్హత సాధించాలంటే నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

CTET 2022: త్వరలోనే సీటెట్​ 2022 నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..


నీట్-2022 దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్స్
అభ్యర్థి ఫొటో స్కాన్ కాపీ, అభ్యర్థి సంతకం స్కాన్ కాపీ, పదో తరగతి పాస్ సర్టిఫికేట్, 12వ తరగతి పాస్ సర్టిఫికేట్, ఆధార్ కాపీ, కేటగిరి సర్టిఫికేట్ తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

నీట్-2022 అప్లై చేసుకునే విధానం

స్టెప్1- NTA NEET 2022 అధికారిక పోర్టల్ neet.nta.nic.inను సందర్శించాలి

స్టెప్2- హోమ్ పేజీకి వెళ్లి రిజిస్ర్టేషన్ ఫారం లింక్‌పై క్లిక్ చేయాలి

స్టెప్3- మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉపయోగించి మీ వివరాలను నమోదు చేసుకోవాలి

స్టెప్4- రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత లాగిన్ ఆధారాలను సేవ్ చేయండి

స్టెప్5- అప్లికేషన్ ఫారంలోని మిగతా వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి

స్టెప్ 6- చివరగా అప్లికేషన్ ఫీజును చెల్లించండి

నీట్-2022 సిలబస్
నీట్ సిలబస్‌లో 11, 12 తరగతులకు సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాఠ్యాంశాలు ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా ఏయే అంశాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఫిజిక్స్
11వ తరగతి
ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్‌మెంట్, కెనమాటిక్స్, మోషన్ లాస్, వర్క్, ఎనర్జీ అండ్ ఫవర్, మోషన్ ఆఫ్ స్టిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ, గురుత్వాకర్షణ, బల్క్ మ్యాటర్ లక్షణాలు, థర్మోడైనమిక్స్, పర్ఫెక్ట్ గ్యాస్ అండ్ కెనటిక్ థియరీ, డోలనాలు- తరంగాలు.

12వ తరగతి
ఎలెక్ట్రోస్టాటిక్స్, సి కరెంట్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ అండ్ మాగ్నెటిజం అయస్కాంత ప్రభావాలు, విద్యుదయస్కాంత ప్రేరణ- ప్రత్యామ్నాయ ప్రవాహాలు, విద్యుదయస్కాంత తరంగాలు, ఆప్టిక్స్, పదార్థం- రేడియేషన్ ద్వంద్వ స్వభావం, అణువులు - కేంద్రకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు

కెమిస్ట్రీ
11వ తరగతి
రసాయన శాస్త్రం, పరమాణువు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, లక్షణాల ఆవర్తనత, రసాయన బంధం - పరమాణు నిర్మాణం, పదార్థ స్థితి: వాయువులు ద్రవాలు, ఉష్ణగతిక శాస్త్రం, సమతౌల్యం, రెడాక్స్ ప్రతిచర్యలు, హైడ్రోజన్, s-బ్లాక్ - ఎలిమెంట్(క్షార - ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్), కొన్ని p-బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ- కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, హైడ్రోకార్బన్స్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ.

12వ తరగతి
సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, p- బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, Haloalkanes అండ్ Haloarenes, ఆల్కహాల్‌లు, ఫినాల్స్ అండ్ ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ ఆమ్లాలు, నైట్రోజన్, బయోమోలిక్యూల్స్, పాలిమర్‌లు, కెమిస్ట్రీ ఆర్గానిక్ సమ్మేళనాలు

జీవశాస్త్రం
11వ తరగతి
జీవన ప్రపంచంలో వైవిధ్యం, జంతువులు- మొక్కలలో నిర్మాణ వ్యవస్థ, కణ నిర్మాణం- పనితీరు, మొక్కల శరీరధర్మ శాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం.

12వ తరగతి
పునరుత్పత్తి, జన్యుశాస్త్రం- పరిణామం, జీవశాస్త్రం- మానవ సంక్షేమం, బయో టెక్నాలజీ- అనువర్తనాలు, జీవావరణ శాస్త్రం --పర్యావరణం.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు