పలు పోస్టుల భర్తీకి ఆయిల్ ఇండియా (Oil India) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 35 ఖాళీలు భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండింగ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్(Medical Officer) , సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మరియు కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ. ఎన్ గ్రేడ్ సి, గ్రేడ్ బి మరియు గ్రేడ్ ఎ విభాగంలో ఖాళీ భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గ్రేడ్ సీ పోస్టుకు రూ.1,50,000 జీతం, గ్రేడ్ బీ పోస్టుకు రూ. 1,20,000 జీతం, గ్రేడ్ ఏ పోస్టుకు రూ.90,000 జీతం ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 10, 2021 వరకు అవకాశం ఉంది.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
సూపరింటెండింగ్ ఇంజనీర్ (డ్రిల్లింగ్) | 65శాతం మార్కులతో ఇంజనీరింగ్ (Engienering) బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి | 01 |
సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (రేడియాలజీ) | రేడియో డయాగ్నోసిస్ MD చేసి ఉండాలి. | 01 |
సూపరింటెండింగ్ ఇంజనీర్ (పర్యావరణం) | ఎన్విరాన్మెంట్ సైన్స్ లో 60శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (Master Degree) ఉండాలి | 03 |
సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (ఆర్థోపెడిక్ సర్జన్) | ఎమ్మెస్ అర్థోపెడిక్ లేదా డీఎన్బీ ఆర్థోపెడిక్ చేసి ఉండాలి | 01 |
సీనియర్ మెడికల్ ఆఫీసర్ | ఎంబీబీఎస్(MBBS) చేసి ఉండాలి | 04 |
సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ | ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి | 01 |
సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) | 65శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి | 6 |
సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) | 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి | 2 |
సీనియర్ ఆఫీసర్ (లీగల్) | 60శాతం మార్కులతో లా చేసి ఉండాలి | 2 |
సీనియర్ ఆఫీసర్ (మెకానికల్) | 65శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి | 10 |
సీనియర్ ఆఫీసర్ (జీయో ఫిజిక్స్) | జీయో ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. | 1 |
సీనియర్ ఆఫీసర్ ( ఇన్ స్ట్రుమెంటేషన్ ) | 65 శాతం మార్కులతో ఇన్ స్ట్రుమెంటేషన్ లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. | 2 |
కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ | కంప్యూటర్ పరిజ్ఞానంతో డిప్లమా చేసి ఉండాలి. | 1 |
CABS DRDO Recruitment 2021: సీఏబీసీ-డీఆర్డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
దరఖాస్తు చేసుకొనే విధానం..
- దరఖాస్తుచేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అప్లికేషన్ ఫాంను ఓపెన్ చేయాలి (అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
- దరఖాస్తు ఫాంలో పూర్తి వివరాలు నమోదు చేయాలి.
- ఫాం నింపిన తరువాత ఆన్లైన్ ఫీజు చల్లించాలి.
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.500 ఉంటుంది.
- దరఖాస్తు ఫాంలో మీరు ఉపయోగించే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification