హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

New Books: 2024-25 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో కొత్త కరిక్యులమ్..విద్యార్థులకు డిజిటల్ బుక్స్

New Books: 2024-25 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో కొత్త కరిక్యులమ్..విద్యార్థులకు డిజిటల్ బుక్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలకు మరో ముందడుగు పడింది. ప్రస్తుతమున్న పుస్తకాల్లోని సిలబస్‌ను రివైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. వీటి స్థానంలో కొత్త టెక్ట్స్ బుక్స్‌ తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యా శాఖ రెడీ అవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

New Books: దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలకు మరో ముందడుగు పడింది. ప్రస్తుతమున్న పుస్తకాల్లోని సిలబస్‌ను రివైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. వీటి స్థానంలో కొత్త టెక్ట్స్ బుక్స్‌(New text books)తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యా శాఖ రెడీ అవుతోంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పుస్తకాలను అన్ని తరగతుల వారికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ కొత్త పుస్తకాలను ముద్రించనున్నారు. వీటితో పాటు డిజిటల్ కాపీలను కూడా సిద్ధం చేయనున్నారు.

ఎడ్యుకేషన్ సిస్టంలో సమూల మార్పులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(National Education policy-NEP)ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌(NCF) పేరుతో గైడ్‌లైన్స్‌ రూపొందించింది. పోటీతత్వాన్ని తట్టుకునే విధంగా, యాక్టివిటీ ఓరియెంటెడ్ లెర్నింగ్‌పై ఫోకస్ పెడుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కొత్త పుస్తకాలకు రూపకల్పన చేయనుంది.

* ఫౌండేషన్ స్టేజ్ కోసం స్పెషల్ ఫ్రేమ్‌వర్క్

జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించడంలో భాగంగా 12వ తరగతి వరకు నేషనల్ కర్యికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రెండు స్టేజీల్లో సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఫౌండేషన్ స్టేజి(3-8 ఏళ్ల చిన్నారులు) ఫ్రేమ్‌వర్క్‌ను గతేడాది అక్టోబరులోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. చిన్నారులకు వికాసం కలిగించే విధంగా బొమ్మలు/వస్తువులతో కూడిన అభ్యసన పద్ధతుల(టాయ్ బేస్‌డ్ లెర్నింగ్)పై ఫోకస్ పెడుతూ ఫౌండేషన్ స్టేజీ NCF మార్గదర్శకాలను తయారు చేసింది. దీని ఆధారంగా ఇప్పుడు కొత్త పాఠ్య పుస్తకాలు రెడీ అవుతున్నాయి. ఒకటి, రెండు తరగతులకు సంబంధించిన టెక్ట్స్ బుక్స్ తయారీ దాదాపు పూర్తయిందని, ఈ నెలాఖరులోగా వీటిని ఆవిష్కరించే అవకాశం ఉందని NCF అధికారి ఒకరు తెలిపారు.

* ఏడాది చివరి నాటికి మరొక ఫ్రేమ్‌వర్క్

మిడిల్, సెకండరీ లెవెల్ స్కూల్(3 నుంచి 12వ తరగతి) విద్యార్థుల కోసం ప్రస్తుతం నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందుతోంది. ఈ మేరకు నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటైంది. కే కస్తూరిరంగన్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫౌండేషన్ స్టేజి కోసం రూపొందించిన కరిక్యులమ్ ఫ్రేమ్‌‌వర్క్‌ని కమిటీ పరిశీలించింది. ఈ సిలబస్ ఆధారంగా పై చదువుల సిలబస్‌ని డిజైన్ చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి సెకండరీ లెవెల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

* మాతృభాషల్లోనూ..

ఫౌండేషన్ స్టేజి విద్యాభ్యాసాన్ని మాతృభాష/ వాడుక భాషలోనే కొనసాగించాలన్నది జాతీయ విద్యా విధానం 2020 ప్రధానోద్దేశం. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా రూపొందిస్తున్న పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ పబ్లిష్ చేయనున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం అన్ని తరగతుల కొత్త పుస్తకాలను రీజినల్ లాంగ్వేజెస్‌లో రూపొందించనున్నట్లు అధికారి స్పష్టం చేశారు. దీంతో పాటు ఏటా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్రమంగా అప్‌డేట్ చేయడానికి ఓ ఇన్‌స్టిట్యూషనల్ బాడీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు.

JEE Main: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్-2 ఎగ్జామ్ సిటీ స్లిప్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

* డిజిటల్ పుస్తకాలు

కోవిడ్ ప్యాండమిక్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రాముఖ్యతను తెలియజేసింది. దీంతో కొత్తగా రూపొందిస్తున్న పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని దీక్షా(DIKSHA) డిజిటల్ ప్లాట్‌ఫారంలో కొత్త పుస్తకాలను లాంచ్ చేయనున్నారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు