చైనా(china)లో శాస్త్రవేత్తలు రెండు డైనోసార్ల నమూనాల(species)ను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీటి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు తెలిపారు. మొదటి డైనోసర్(Dinosaur) దాదాపు 65.6 అడుగుల పొడువు, రెండో డైనోసర్ 55.77 అడుగుల పొడువుతో ఉండొచ్చని శాస్త్రవేత్తలు(Scientists) భావిస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ మ్యూజియం ఆఫ్ బ్రెజిల్ సైంటిస్టులు డైనోసర్లపై తమ పరిశోధనలను నేచర్ ఫ్యామిలీ ఆఫ్ జర్నల్స్‌లో భాగమైన సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో గురువారం ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం.. వాయువ్య చైనాలో రెండు కొత్త జాతుల డైనోసర్‌ల నమూనాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు దాదాపు 130 నుంచి 120 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని తెలిపారు. ఈ డైనోసర్లు చైనాలోని తుర్పాన్-హామి బేసిన్‌లో 2 నుంచి 5 కి.మీ దూరంలో నివసించి ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. బయటపడిని డైనోసార్ల నమూనాల(species)కు శాస్త్రవేత్తలు సిలుటిటాన్ సినెన్సిస్ లేదా "సీలు’’, హమిటిటాన్ జిన్జియాంగెన్సిస్ లేదా హమీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. శిలాజాలు జిన్జియాంగ్‌లో కనుగొన్నారు. అందుకే అలా పేరు పెట్టారు. ఇక "సీలు" అంటే చైనీస్‌లో "సిల్క్ రోడ్" అని అర్థం. " హామి "అనేది నమూనాలు కనుగొనబడిన హామి నగరాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం.. సిలుటిటాన్ సినెన్సిస్ అనేది ఒక కొత్త జాతి డైనోసర్ (Dinosaur) . పొడవు మెడ, పొడవాటి తోక, పెద్ద శరీరం, చిన్న తల కలిగింది. అయితే ఇది కేవలం మొక్కను తినే డైనోసర్. ఇది ఇప్పటివరకు తూర్పు ఆసియాలో మాత్రమే ఉండేది. పరిశోధకులు హమిటిటాన్ డైనోసార్ 55 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుందని అంచనా వేశారు. దక్షిణ అమెరికాలో కనిపించే సౌరోపాడ్‌ల మాదిరిగా ఉందని తెలిపారు. ఇవి ఆసియా, దక్షిణ అమెరికాలలో తిరిగేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సిలుటిటాన్ నమూనా 65.6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉందన్నారు శాస్త్రవేత్తలు. హమిటిటన్ నమూనా 55.77 అడుగుల పొడవు ఉందని, ఈ డైనోసర్లు నీలి తిమింగలం వలె పెద్దవిగా ఉండొచ్చని వారు అంచనా వేశారు. వారికి మరొక నమూనా కూడా దొరికింది. ఈ మూడో శిలాజం సోంఫోస్పాండిలాన్ సౌరోపాడ్ కావచ్చని, సుమారు 160.3 మిలియన్ సంవత్సరాల క్రితం జంతువు అయి ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనం ఫలితంపై చాలా సంతోషిస్తున్నామని రియో డి జనీరోలోని నేషనల్ మ్యూజియం డైరెక్టర్ అలెగ్జాండర్ కెల్నర్ వ్యాఖ్యానించారు. దక్షిణ అమెరికా, ఆసియాలలో డైనోసార్ల చరిత్ర ఎలా ముగిసిన పోయిందనేది ఇంకా తెలుసుకోవాలని బ్రెజిలియన్ పాలియోంటాలజిస్ట్ అన్నారు. డైనోసార్ల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి లోతుగా తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్తగా కనుగొన్న డైనోసార్ల జాతుల గుడ్లు, పిండ అవశేషాలతో నిండిన గూళ్లు క్రింద దాగి ఉన్నాయని అనుకుంటున్నట్లు కెల్నర్ చెప్పారు.
కాగా, గతంలోనూ చైనాలో ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో డైనోసార్ల గుడ్లు దొరికాయి. గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్న అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. వారికి అక్కడ ఏకంగా 231 గుడ్లు ఒక డైనోసార్ అస్థిపంజరం కూడా దొరికింది. వాటన్నిటినీ అధికారులు స్వాదీనం చేశారు. గువాంగ్ డోంగ్ రాజధాని హెయువాన్ నగరంలో నెల రోజుల క్రితం ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్విస్తున్నాడు. తవ్వకాలు జరుపుతుండగా శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది. అయితే ఇంటి యజమాని వారికి ప్రభుత్వం అప్పగించకుండా దాచిపెట్టుకున్నారని అధికారులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, EDUCATION, Information Technology, News