Home /News /jobs /

Infosys Jobs: ఇన్పోసిస్‌లో కొత్త ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి గడువు జూలై 25.. పూర్తి వివరాలు ఇలా..

Infosys Jobs: ఇన్పోసిస్‌లో కొత్త ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి గడువు జూలై 25.. పూర్తి వివరాలు ఇలా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Infosys Jobs: ఇన్ఫోసిస్ సంస్థ 1 నుంచి 4 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం నియామకాలను నిర్వహిస్తోంది. జావా, డాట్ నెట్‌లో అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25వ తేదీలోగా అర్హత కలిగినవారు అప్లికేషన్లు పంపాలని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మంచి జీతం, అలవెన్సులతో పాటు అత్యాధునిక జీవనశైలి ఈ జాబ్స్‌లో ఉంటుంది. అందులోనూ ఇన్ఫోసిస్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ 1 నుంచి 4 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం నియామకాలను నిర్వహిస్తోంది. జావా, డాట్ నెట్‌లో అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇన్ఫోసిస్ షేర్ చేసింది. జులై 25వ తేదీలోగా అర్హత కలిగినవారు అప్లికేషన్లు పంపాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇన్ఫోసిస్ కెరీర్ ఆన్ లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసి వర్చువల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు..
సిస్టం ఇంజినీర్
ఈ జాబ్ కు బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. దీంతో పాటు 12 నుంచి 14 నెలల కనీస పని అనుభవాన్ని కలిగి ఉండాలి. బీసీఏ/బీఎస్సీ గ్రాడ్యుయేట్లు అయితే 24 నుంచి 36 నెలల సంబంధిత రోల్‌లో అనుభవం ఉండాలి.
సీనియర్ సిస్టం ఇంజినీర్
ఈ ఉద్యోగానికి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ విద్యార్హత కలిగి ఉండాలి. అంతేకాకుండా 24 నుంచి 36 నెలల అనుభవం ఉండాలి. బీసీఏ/బీఎస్సీ గ్రాడ్యూయేట్లు అయితే 36 నుంచి 48 నెలల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
ఇన్ఫోసిస్ భారత్‌లో 19,230 మంది గ్రాడ్యుయేట్లను, భారత్ వెలుపల 1941 మంది నియమించుకుంటున్నట్లు తెలిపింది. ప్రతిభావంతులతో సంస్థను బలోపేతం చేస్తున్నట్లు గత నెలలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. సంస్థ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. క్లౌడ్ ఫస్ట్ డిజిటల్ తరంలో ఇన్ఫోసిస్ మరో ఏడాది మార్కెట్ లీడింగ్ పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్లిందని, మెరుగైన స్థానాన్ని పొందిందని చెప్పారు.

ఇతర ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు సైతం కొత్త నియామకాలపై దృష్టి సారించాయి. టీసీఎస్ ఆగస్టు 2021, నవంబరు 2021 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. టీసీఎస్ స్ట్రాటజిక్ విభాగం టీసీఎస్ iON ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ టెస్టును క్లియర్ చేసిన అభ్యర్థులు టీసీఎస్ కాకుండా ఇతర సంస్థల ద్వారా నియమితులవుతారు.
Published by:Veera Babu
First published:

Tags: Infosys, JOBS, Software

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు