కాలం రివ్వున తిరుగుతోంది. కాలంతో పాటు.. టెక్నాలజీలో(Technology) కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మెటావర్స్ వంటి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ(Reality), ఇమ్మర్సివ్ టెక్నాలజీస్(Technologies), సోషల్ మీడియా(Social Media), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో రూపొందుతోంది. విద్యా, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తు కోసం బ్లూ కాలర్ వర్క్‌ఫోర్స్‌ను(Work Force) పెంచడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ఎడ్‌టెక్ పరిశ్రమను బలోపేతం చచేయడం వంటివి మెటావర్స్‌తో సాధ్యమవుతాయి. ఇలా.. తాను మారుతూ పరిస్థితులనూ మార్చేస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉద్యోగాల్లో చాలా రకాలు ఇప్పుడు లేవు. అలాగే ఇప్పుడు ఉన్నవాటిలో కొన్ని భవిష్యత్తులో ఉండకపోవచ్చు. సమీప భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు రూపొందనున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.
క్రియేటర్ అడ్వైజర్స్.. గడిచిన పదేళ్లలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు బాగా పెరిగారు. ప్రస్తుతం స్థిర ఆదాయం వాటిలో కంటెంట్ క్రియేటింగ్ ఒకటిగా మారిపోయింది. దీనికి అనుబంధంగా మరిన్ని ఉద్యోగాలు రూపొందాయి. క్రియేటర్ల పనితీరును గమనిస్తూ వారికి సహాయ సహకారాలు అందించేలా వీరి సేవలు ఉంటాయి.
టాలెంట్ మేనేజర్లు.. దీన్ని ఇప్పటికే ఉన్న హెచ్‌ఆర్ విభాగాలకు అనుబంధంగా చెప్పవచ్చు. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగుల బలాలు, బలహీనతలను గుర్తిస్తూ... వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ, మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేయడమే టాలెంట్ మేనేజర్ పని.
టాకర్/వాకర్.. ఒంటరిగా ఉండేవారి కోసం ఈ ఉద్యోగాలు రాబోతున్నాయి. వృద్ధులతో వాకింగ్‌కు వెళ్లడం, వారితో మాట్లాడటం, స్నేహం చేయడం, ఇవన్నీ కెరియర్ అవకాశాలుగా మారనున్నాయి.
పర్సనల్ ట్రైనర్.. ఒకప్పుడు సెలబ్రిటీలకే పరిమితమైన పర్సనల్ ట్రైనర్ల సేవలను ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వారికి కూడా భవిష్యత్ లో అందుబాటులో ఈ ఉద్యోగాలు రానున్నాయి.
ఆన్‌లైన్ టీచర్స్.. ఇప్పటికే ఆన్ లైన్ విధానంలో బోధన మొదలైంది. భవిష్యత్ లో భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవే కాకుండా.. డేటా సైంటిస్ట్, మెషీన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, మెడికల్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ప్రొడక్ట్ మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, మార్కెటింగ్ మేనేజర్, బ్లాక్‌చెయిన్ డెవలపర్, జర్నలిస్ట్, రిసెర్చ్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, వెబ్‌డెవలపర్, డిజైనర్. వీటికి వచ్చే పదేళ్లలో మరింత ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Artificial intelligence, Career and Courses, Central Government Jobs, Central jobs, Future jobs, JOBS, Metaverse, Private Jobs