New Courses: డ్రోన్ పైలట్‌తో పాటు మరిన్ని కొత్త కోర్సులు... సెప్టెంబర్ 6న అడ్మిషన్

New courses | జియో ఇన్ఫర్మెటిక్స్ అసిస్టెంట్ కోర్సుకు మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాసై ఉండాలి. మిగిలిన అన్ని కోర్సులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైతే చాలు.

news18-telugu
Updated: August 31, 2019, 11:23 AM IST
New Courses: డ్రోన్ పైలట్‌తో పాటు మరిన్ని కొత్త కోర్సులు... సెప్టెంబర్ 6న అడ్మిషన్
New Courses: డ్రోన్ పైలట్‌తో పాటు మరిన్ని కొత్త కోర్సులు... సెప్టెంబర్ 6న అడ్మిషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మారుతున్న టెక్నాలజీ, కొత్తగా పుట్టుకొస్తున్న రంగాలు, పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. హైదరాబాద్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-NSTI కొత్త కోర్సుల్ని అందిస్తోంది. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యానగర్, రామాంతపూర్ శాఖల్లో సోలార్ టెక్నీషియన్, జియో ఇన్ఫర్మెటిక్స్ అసిస్టెంట్, మెషినిస్ట్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఐఓటీ కోర్సుల్ని అందిస్తున్నట్టు హైదరాబాద్‌లోని రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్-RDSDE ప్రాంతీయ డైరెక్టర్ తెలిపారు. జియో ఇన్ఫర్మెటిక్స్ అసిస్టెంట్ కోర్సుకు మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాసై ఉండాలి. మిగిలిన అన్ని కోర్సులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైతే చాలు. ఈ కోర్సుల్లో జాయిన్ కావాలనుకునేవాళ్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 2 పాస్‌పోర్టులతో విద్యానగర్, రామాంతపూర్‌లోని ఎన్ఎస్‌టీఐ బ్రాంచ్‌లకు వెళ్లాలి.

NSTI Courses: కొత్త కోర్సుల వివరాలు ఇవే...



NSTI విద్యానగర్ బ్రాంచ్‌లో అందించే కోర్సులు
సోలార్ టెక్నీషియన్- 1 ఏడాది
జియో ఇన్ఫర్మెటిక్స్ అసిస్టెంట్- 1 ఏడాది
మెషినిస్ట్- 2 ఏళ్లు

NSTI రామాంతపూర్ బ్రాంచ్‌లో అందించే కోర్సులుడ్రోన్ పైలట్- 6 నెలలు
టెక్నీషియన్ ఐఓటీ- 1 ఏడాది

స్పాట్ అడ్మిషన్ చేపట్టే తేదీ: 2019 సెప్టెంబర్ 6 (ముందుగా వచ్చినవారికే ప్రాధాన్యం)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే

DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading