Home /News /jobs /

NEW COURSES IN IIT HYDERABAD IF YOU READ THESE YOUR FUTURE IS GOLD TAKE A LOOKYOUR MIND UMG GH

Medical Physics: ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సులు.. ఇవి చదివితే మీ భవిష్యత్ బంగారమే !

 ఐఐటీ హైదరాబాద్ లో కొత్త కోర్సులు.. ఇవి చదివితే మీ భవిష్యత్ బంగారమే ! లుక్కేయండి

ఐఐటీ హైదరాబాద్ లో కొత్త కోర్సులు.. ఇవి చదివితే మీ భవిష్యత్ బంగారమే ! లుక్కేయండి

మానవ వ్యాధుల నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సలో మెడికల్ ఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అప్లైడ్ ఫిజిక్స్ (Applied Physics) బ్రాంచ్‌లో మూడేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc) ప్రోగ్రామ్‌ను IIT హైదరాబాద్ త్వరలోనే ప్రారంభించనుంది.

మానవ వ్యాధుల నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సలో మెడికల్(Medical) ఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అప్లైడ్ ఫిజిక్స్ (Applied Physics) బ్రాంచ్‌లో మూడేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc) ప్రోగ్రామ్‌ను IIT హైదరాబాద్ త్వరలోనే ప్రారంభించనుంది. సంస్థలోని బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్(Cancer) హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BIACH&RI)తో కలిసి మెడికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వైద్య, రేడియేషన్ భౌతిక శాస్త్రవేత్తలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.

ఈ ప్రోగ్రామ్‌ను అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) ఆమోదించింది. ఇది మెడిసిన్‌లో ఫిజిక్స్‌ని అప్లై చేసే కాన్సెప్ట్స్‌, టెక్నాలజీలలో వరల్డ్-క్లాస్‌ మెడికల్ ఫిజిసిస్ట్ స్పెషలిస్ట్ ట్రైనింగ్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 12 నెలల పాటు రేడియేషన్ ఫిజిక్స్, క్లినికల్ ఇమ్మర్షన్, షాడోవింగ్, ఇండస్ట్రీ/క్లినికల్ లెక్చర్‌లు, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్‌లు విద్యార్థులకు అందించనుంది. మూడో సంవత్సరంలో క్లినికల్ ఇంటర్న్‌షిప్ కోసం క్లినికల్ ఓరియంటేషన్‌ను అందించాలని భావిస్తోంది. సర్టిఫికేషన్ కోసం ఈ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి అని ఐఐటీ తెలిపింది.

ఇదీ చదవండి: Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!


ఫిజిక్స్ అనేది ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా ఉన్న BSc అభ్యర్థులకు ఈ ప్రోగ్రామ్ ఉత్తమంగా నిలుస్తుంది. మానవ వ్యాధుల నివారణ, రోగ నిర్ధారణ, చికిత్స కోసం అప్లైడ్ ఫిజిక్స్ కెరీర్ చేపట్టాలనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ సహాయపడుతుందని ఐఐటీ సంస్థ తెలిపింది. ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన BSc విద్యార్థుల నుంచి IIT హైదరాబాద్ అడ్మిషన్లకు కోరుతోంది. వీరు మెడికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తులు పరిశీలిస్తారు. అలానే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కోర్సులో సెలెక్ట్ అయిన విద్యార్థులు రెండు సంవత్సరాల కోర్సు వర్క్ (66 క్రెడిట్‌లు), ఒక సంవత్సరం (24 క్రెడిట్‌లు) తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌తో కూడిన మొత్తం 90 క్రెడిట్‌లను మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.



ఐఐటీ హైదరాబాద్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగాల్లో UG, PG & PhD ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఇందులో విద్యార్థులు హెల్త్ కేర్ రంగంలోని వివిధ సవాళ్లను పరిష్కరిస్తున్నారు. IITH MSc (మెడికల్ ఫిజిక్స్) ప్రోగ్రామ్, BIACH&RI సహకారంతో, IITH వద్ద హెల్త్‌కేర్ రంగంలో లాంచ్ చేసిన మూడో PG ప్రోగ్రామ్. ఇది NEPకి అనుగుణంగా, విద్యార్థులకు బలమైన విద్యా నేపథ్యాన్ని మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను అందిస్తుంది. విద్యార్థులకు ఏడాది పొడవునా క్లినికల్ ఇంటర్న్‌షిప్ రూపంలో వారిని ఇండస్ట్రీకి సిద్ధం చేస్తుంది" అని IITH డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్ మూర్తి అన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Cancer, Career and Courses, IIT Hyderabad, JOBS

తదుపరి వార్తలు