Home /News /jobs /

NEW COURSES ARE GOING TO BE INTRODUCED IN TELANGANA DEGREE FROM THIS ACADEMIC YEAR TELANGANA COUNCIL OF HIGHER EDUCATION HAS TAKEN A DECISION TO THIS EXTENT VB

Telangana New Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు.. కొత్తగా BA, BSc, B.Com, BBA.. వివరాలిలా..

Telangana New Degree Courses: డిగ్రీల్లో కొత్త కోర్సులు.. కొత్తగా BA, BSc, B.Com, BBA.. వివరాలిలా..

Telangana New Degree Courses: డిగ్రీల్లో కొత్త కోర్సులు.. కొత్తగా BA, BSc, B.Com, BBA.. వివరాలిలా..

Telangana New Degree Courses: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ కోర్సుల్లో కొత్తగా బీఏను ఆఫర్‌ చేయనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
విద్యా సంవత్సరం(New Academic Year) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలుIDegree Colleges) ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌(International Relations), ఎకనామిక్స్‌(Economics), పొలిటికల్‌ సైన్స్‌(Political Science) కోర్సుల్లో కొత్తగా బీఏనుIBA) ఆఫర్‌ చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో బుధవారం జరిగిన సమావేశంలో కోర్సు పాఠ్యాంశాలను ఖరారు చేశారు.  తెలంగాణ సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీలు నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సును అందించనున్నారు.

ISRO Jobs: ఇస్రోలో టీచర్ ఉద్యోగాలు.. PGT, TGT, PET ఖాళీలు.. త్వరలో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..


సంబంధిత సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. ఏవైనా మిగిలిపోయిన సీట్లు తెలంగాణలోని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్(DOST) ద్వారా భర్తీ చేయబడతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశ పెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. నేడు ఉన్నత స్థాయి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగానే డిగ్రీలోని బీఏలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనిని 2022-2023 విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

RRB Group D First Day Questions: మొదటి రోజు రైల్వే గ్రూప్ డీ పరీక్ష ప్రశాంతం.. ప్రశ్నల సరళి ఇలా..


బీసీ సంక్షేమ రెసిడెన్షియల్, సాంఘిక, గిరిజన విద్యా సంస్థల సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో ఈ కొత్త కోర్సును అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇంతక ముందే బీఏలో కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌, పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీ కోసమే ఈ కరెంట్ అఫైర్స్..

ఇదిలా ఉండగా.. ఇటీవల రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 18 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఆధునిక స్పెషలైజేషన్లతో కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవి బీబీఏలో రిటైలింగ్‌, లాజిస్టిక్స్‌ స్పెషలైజేషన్లతో వేర్వేరు కోర్సులు చదవొచ్చు. అగ్రి స్టోరేజ్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ కోర్సు మరియు ఈ కామర్స్ ఆపరేషన్స్ వంటి కోర్సులను బీకామ్ లో ప్రవేశపెట్టారు. గేమింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ అండ్ అడ్వర్టయిజింగ్, యానిమేషన్ కోర్సులను బీఎస్సీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ కోర్సులకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఆమో దం తెలిపింది. ఈ కోర్సులన్నీ ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచే అమ్మలోకి రానున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Degree students, JOBS, Telangana, Telangana jobs

తదుపరి వార్తలు