హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

New Course: 5జీ టెక్నాలజీస్‌పై స్పెష‌ల్ కోర్సు.. ఐఐఎస్‌సీ బెంగళూరు స్పెష‌ల్‌ ప్రోగ్రామ్

New Course: 5జీ టెక్నాలజీస్‌పై స్పెష‌ల్ కోర్సు.. ఐఐఎస్‌సీ బెంగళూరు స్పెష‌ల్‌ ప్రోగ్రామ్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Career and Courses | ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) బెంగళూరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్‌తో కూడిన 5జీ టెక్నాలజీస్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్(Post Graduate) స్థాయిలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ఆఫర్(Offer) చేస్తోంది.

ఇంకా చదవండి ...

ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) బెంగళూరు(Bangalore).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్‌తో కూడిన 5జీ టెక్నాలజీస్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్(Post Graduate) స్థాయిలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్(Advanced Certification) ప్రోగ్రామ్‌ను ఆఫర్(Offer) చేస్తోంది. హైపర్-కనెక్ట్‌టెడ్ కమ్యూనికేషన్(Communication) స్పేస్‌లో అభివృద్ధి చెందుతున్న 5G టెక్నాలజీలో టెక్ నిపుణులు మరింత మెరుగ్గా రాణించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. గ్లోబల్ ఎడ్‌టెక్ కంపెనీ టాలెంట్‌స్ప్రింట్ భాగస్వామ్యంతో ఈ కోర్సును ఐఐఎస్ బెంగళూరు చేపట్టనుంది. '5G-రెడీ ప్రొఫెషనల్స్‌తో కూడిన నిపుణులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఐఐఎస్సీ బెంగళూరు తెలిపింది.

SSC Phase-10 Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 ఉద్యోగాలు.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ టిప్స్ ఫాలో అవ్వండి

ఇంజనీరింగ్ లేదా సంబంధిత డిగ్రీలతో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. కోర్సు ఫార్మాట్ రెండు భాగాలుగా విభజించారు. ఒకటి.. 5G టెక్నాలజీస్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్‌ కోర్సులో తొమ్మిది నెలల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ ఉంటుంది. మరొకటి 5G టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్‌తో కూడిన ఆరు నెలల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, తర్వాత IISc బెంగళూరు క్యాంపస్ సందర్శన, IISc ఫ్యాకల్టీ, పరిశ్రమ నిపుణులతో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్లు.. వంటివి ఉండనున్నాయి.

తొమ్మిది నెలల కోర్సు కోసం విద్యార్థులు రూ.3.20 లక్షలు, ఆరు నెలల కోర్సు కోసం రూ.2.80 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ చంద్ర ఆర్.మూర్తి నేతృత్వంలోని ప్రముఖ పరిశోధకులు, నిపుణుల బృందం పాఠాలను బోధించనుంది. Talent Sprint డిజిటల్ ప్లాట్‌ఫారమ్ iearl.ai ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రోగ్రామ్ పేజీ  https://iisc.talentsprint.com/5g/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

TSSPDCL Preparation: విద్యుత్ శాఖ‌లో కొలువు కొట్టాలంటే.. ఈ టాపిక్స్‌పై ప‌ట్టు సాధించాలి.. టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

IISc బెంగళూరు ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ చంద్ర R. మూర్తి మాట్లాడుతూ.. 5G టెక్నాలజీ రాకతో అతుకులు లేని కార్యకలాపాలకు గ్యారెంటీతో కూడిన హై-స్పీడ్ డేటా బదిలీ అవసరం చాలా కీలకమన్నారు. RAN విభజన, క్లౌడ్‌ఫికేషన్, నెట్‌వర్క్ స్లైసింగ్ తదితర 5G టెక్నాలజీ ఫీచర్లతో కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI అప్లికేషన్లలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఈ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చే విధానాన్ని అర్థం చేసుకోవడంతో పాటు వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే మార్గాలను కనుగొనడం ఎంతో కీలకమన్నారు.

ISB: ఐఎస్‌బీ హైద‌రాబాద్‌లో ఫైనాన్స్ రంగంలో కొత్త కోర్సు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ స్టాక్‌ల లభ్యతతో, 5G ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఆధారిత పరిష్కారంగా మారుతుందని, దేశంలో పెద్ద ఎత్తున ఇది ప్రవేశించడానికి అవకాశాలు బాగానే ఉన్నాయని మూర్తి అభిప్రాయపడ్డారు. 5G కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆచరణాత్మక, సైద్ధాంతిక, సాంకేతిక అంశాలను ఈ కోర్సు కవర్ చేయనుందన్నారు. భవిష్యత్తు కెరీర్ అవకాశాల కోసం ఇది గేమ్ ఛేంజర్‌గా ఉంటుందన్నారు. 5G అధిక డేటా వేగంతో ఎక్కువ సామర్థ్యం, ​​మెరుగైన విశ్వసనీయత, విస్తృత భౌగోళిక కవరేజీని అందిస్తుందని మూర్తి పేర్కొన్నారు.

CTET 2022: సీటెట్‌కు అప్లై చేస్తున్నారా? పరీక్ష విధానం, పాసింగ్ మార్క్స్ వంటి వివరాలు తెలుసుకోండి..

టాలెంట్‌ స్ప్రింట్ CEO, MD డాక్టర్ శాంతను పాల్ మాట్లాడుతూ.. భవిష్యత్ డీప్-టెక్ ప్రోగ్రామ్‌లను అందించడంలో తాము మార్గదర్శకులుగా ఉంటున్నామన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ప్రతిభను సృష్టించడంపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. IIScతో మరో ఫార్వర్డ్-లుకింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పని చేసే నిపుణుల కోసం మూల్యాంకనం రూపొందించడం వాటి అమలు కోసం 5G కమ్యూనికేషన్‌ల బలమైన పునాదిని నిర్మించడానికి ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు శాంతన్ పాల్ వెల్లడించారు.

First published:

Tags: Career and Courses, New course, New courses

ఉత్తమ కథలు