NEW COURSE IF YOU WANT TO CHOOSE A CAREER IN THE FIELD OF DIGITAL HEALTH BEST ONLINE COURSE KNOW ELIGIBILITY AND FEE DETAILS EVK
New Course: డిజిటల్ హెల్త్ రంగంలో కెరీర్ ఎంచుకోవాలంటే.. బెస్ట్ ఆన్లైన్ కోర్సు.. అర్హత, ఫీజు వివరాలు!
ప్రతీకాత్మక చిత్రం
Digital Health Course | దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (Bangalore) డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్‌లో ఆరు నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కెరీర్లో ఎదిగేందుకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science), బెంగళూరు (Bangalore) డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్‌లో ఆరు నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెల్త్‌కేర్, టెక్నాలజీ బిల్డింగ్ ఈ–హెల్త్, టెలిమెడిసిన్, పర్సనలైజ్డ్ హెల్త్‌కేర్, బయోటెక్, మెడికల్ డివైజ్ (Medical Device)లు, వేరబుల్స్, డిజిటల్ థెరప్యూటిక్స్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. సైన్స్, ఇంజనీరింగ్ (Engineering), మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ (Program)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత విభాగంలో వారికి ఏడాది పని అనుభవం కూడా ఉండాలి.
టాలెంట్ స్ప్రింట్ భాగస్వామ్యంతో..
టాలెంట్‌స్ప్రింట్ భాగస్వామ్యంతో ఐఐఎస్సీ ఈ కోర్సును అందిస్తోంది. ఆన్లైన్ కోర్సులో భాగంగా ఎడ్టెక్ కంపెనీకి చెందిన బ్రిడ్జ్ మాడ్యూల్ ద్వారా శిక్షణనిస్తోంది. మ్యాథ్స్ (Math), ప్రోగ్రామింగ్‌లో అభ్యర్థి లోతైన అవగాహన పెంచుకోవడంలో సహాయపడుతుంది.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది.
- అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://talentsprint.com/programs.dpl అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.
- శని, ఆదివారాల్లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు.
- భారతీయ అభ్యర్థులు రూ. 1,70,000, ఎన్నారై (NRI)లు $2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను వారి విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఐఐఎస్సీ ఎంపిక చేస్తుంది.
కొత్త టెక్నాలజీలపై అవగాహన
ఈ ప్రోగ్రామ్‌ను ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) విభాగం నిర్వహిస్తుంది. హెల్త్ సెక్టార్‌లోని విద్యార్థులకు కొత్త టెక్నాలజీస్‌పై అవగాహన పెంచే విధంగా ఈ కోర్సును డిజైన్ చేసింది. రీసెర్చ్ & డెవలప్మెంట్ (Research and Development) లాబొరేటరీలు, పరిశ్రమల్లో పనిచేసే రీసెర్చ్ సైంటిస్ట్‌లు/ఇంజినీర్లు, టెక్నాలజీ ఇంటెన్సివ్, డేటా ఆధారిత సంస్థల నిర్వాహకులకు ఈ కోర్సు (Course) ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారిక నోటీసులో పేర్కొంది.
నేర్పించే అంశాలివే..
- ఈ డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్ కోర్సులో భాగంగా ఎసెన్షియల్ మ్యాథ్, ప్రోగ్రామింగ్, డిజిటల్ హెల్త్ ఇంట్రడక్షన్, వేరెబుల్ డివైజెస్, ఫిజియోలాజికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్/విజన్ వంటి విభాగాలపై లోతైన అవగాహన పెంచుకోవచ్చు.
- ఈ కోర్సులను నేర్చుకున్న అభ్యర్థులకు హెల్త్‌కేర్ డేటా (Health Care DATA) అనలిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, హెల్త్ ఏఐ, సీనియర్ మెడికల్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్ - హెల్త్‌కేర్ ఇమేజ్ అనలిటిక్స్, డిజిటల్ హెల్త్ కన్సల్టెంట్ అండ్ డిజిటల్ హెల్త్ డెవలపర్‌గా అనేక అవకాశాలు లభిస్తాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.