Education: పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్.. అదిరిపోయిందిగా..

రీడ్​ ఎలాంగ్​ యాప్​

గూగుల్​ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్​ను విడుదల చేసింది. చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్​ రూపొందించింది. ఆ యాప్​ పేరే రీడ్​ ఎలాంగ్​ యాప్​.

  • Share this:
    కరోనా కారణంగా పిల్లలు చదువులు అటకెక్కిన సంగతి తెలిసిందే. కొద్దోగొప్పో ప్రపంచం తెలిసిన పిల్లలైతే ఆన్​లైన్​ క్లాసులు ఏదో రకంగా నెట్టుకొస్తున్నారు. మరీ చిన్న పిల్లలైతే పరిస్థితి ఇక అంతే. వాళ్లకి ఆటలు తప్ప మరో ధ్యాస ఉండదు. ఇక వారికి చదువులు ఎలా చెప్పించాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.  1,2వ తరగతులు పిల్లలకైతే మరీ కష్టంగా ఉందంటూ పలువురు తల్లిదండ్రులు కంప్లైంట్స్​ కూడా చేస్తుంటారు. ఇవన్నీ ఒక్క యాప్​తో దూరమయ్యేలా గూగుల్​ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్​ను విడుదల చేసింది. చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్​ రూపొందించింది. ఆ యాప్​ పేరే రీడ్​ ఎలాంగ్​ యాప్​.. దీనిలో లాగిన్​ అయ్యాక.. దియా అనే ఒక కంప్యూటర్​ వాయిస్​ మనల్ని గైడ్​ చేస్తుంది. ఆ యాప్​ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతుంది. ఈ యాప్​ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ తదితర భాషల్లో అందుబాటులో ఉంది. ఆ యాప్​లో ఏమున్నాయ్​.. అంత ప్రత్యేకత ఎంటో ఓ లుక్కేద్దాం..

    తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని ఆడుతూ పాడుతూ నేర్పే రీడ్​ ఎలాంగ్​ యాప్​​ను గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఈ యాప్​లోని సహాయకురాలు దియా యాప్​ను ఎలా వినియోగించాలో చెబుతుంది. పదాలు, వాక్యాలు ఎలా చదవాలో గైడ్ చేస్తుంది. ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుతుంది. సరిగా చదవమని చెబుతుంది. యాప్​లో గ్రంథాలయం కూడా ఉంది.  ఛోటా భీమ్​, బాలల కథలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కథలూ అందుబాటులోకి తేనుంది. యాప్​ని ఆఫ్​లైన్​లో కూడా వాడొచ్చని నిపుణులు తెలిపారు. కరోనాతో చదువులకు దూరమైన 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటివద్దే పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆటలు, పాటలతో కూడిన యానిమేషన్‌ వీడియోలతో ఆకట్టుకునేలా పాఠ్యాంశాలను రూపొందించింది. రోజుకు అరగంట చొప్పున పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణాసంస్థ (ఎన్​సీఈఆర్​టీ) హోం లెర్నింగ్‌ ప్రోగ్రాంను రూపకల్పన చేసింది. కానీ, టీవీ అంటే పిల్లలు అంత ఆసక్తిగా చూడకపోవచ్చు. అందుకే రీడ్​ ఎలాంగ్​ యాప్​ వినియోగించాలంటూ ఎన్​సీఈఆర్​టీ ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు కూడా జారీచేసింది. ఈ యాప్​ చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్​సీఈఆర్​టీ పేర్కొంది.
    Published by:Prabhakar Vaddi
    First published: