Engineering Classes: డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు.. ఏఐసీటీఈ కీలక ప్రకటన

Engineering Classes: అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక ప్రకటన చేసింది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని ఆయా యూనివర్సిటీలను ఆదేశించింది.

news18-telugu
Updated: October 22, 2020, 6:02 PM IST
Engineering Classes: డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు.. ఏఐసీటీఈ కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతబడ్డాయి. అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో అనేక కోర్సుల్లో ప్రవేశాలు ఆగిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను సైతం విడుదల చేస్తున్నారు. త్వరగా ప్రవేశాలను పూర్తి చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో తరగతులు నిర్వహించడానికి ఆయా యూనివర్సిటీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక ప్రకటన చేసింది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, సంబంధిత యూజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని ఆయా యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా ఏఐసీటీఈ రివైజ్డ్‌ షెడ్యూలును విడుదల చేసింది. గతంలో నవంబర్‌ 1 నుంచే తరగతులను ప్రారంభించేలా అకడమిక్‌ షెడ్యూలును ప్రకటించారు. అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఏఐసీటీఈ అకడమిక్‌ షెడ్యూలును సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.


వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో నవంబర్‌ 30లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని తాజా ప్రకటనలో ఏఐసీటీఈ పేర్కొంది. డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని సూచించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తరగతులను నిర్వహించాలని ఆయా యూనివర్సిటీలకు సూచించింది.

అవసరమైతే ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండు పద్ధతుల్లో తరగతలు నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటికే తరగతులు ఆలస్యమైన నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన పెంచేందుకు నిర్వహించనున్న ఇండక్షన్‌ ప్రోగ్రాంను 3 వారాలకు బదులుగా మొదట ఒక వారమే నిర్వహించాలని సూచించింది. మిగతా రెండు వారాల ప్రోగ్రాంను తదుపరి సెమిస్టర్లలో నిర్వహించాలని సూచించింది.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading