NETWORKING OPPORTUNITIES AT US UNIVERSITIES HELP STUDENTS SET THE STAGE FOR A GLOBAL CAREER GH VB
Building Global Careers: యూఎస్ వర్సిటీలతో గ్లోబల్ కెరీర్.. క్రాస్ కల్చరల్ ఎక్స్‌పోజర్‌తో అవకాశాలు..?
ప్రతీకాత్మక చిత్రం
యూఎస్ యూనివర్సిటీలలో అత్యాధునిక కార్యక్రమాలు, క్రాస్ కల్చరల్ ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ అవకాశాలు విద్యార్థుల గ్లోబల్ కెరీర్‌కు ఒక ప్లాట్‌ఫామ్‌లా సహాయపడతాయి.
యూఎస్ యూనివర్సిటీలలో(US University) అత్యాధునిక కార్యక్రమాలు, క్రాస్ కల్చరల్ ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ అవకాశాలు విద్యార్థుల గ్లోబల్ కెరీర్‌కు(Global Career) ఒక ప్లాట్‌ఫామ్‌లా సహాయపడతాయి. యునైటెడ్ స్టేట్స్‌లోని యూనివర్సిటీలలో(University) చేరడంతో కలిగే ప్రయోజనాలు అంతర్జాతీయ డిగ్రీని(Degree) పొందడం కంటే ఎక్కువ. అందుబాటులో ఉన్న 4,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన కళాశాలలు, వర్సిటీలలో ప్రతి సంస్థ విద్యార్థులకు విలక్షణమైన అనుభవాన్ని అందిస్తుంది. అత్యాధునికమైన వసతులు, విద్యా ప్రమాణాలు, పోటీతత్వం వంటివే కాకుండా యునైటెడ్ స్టేట్స్‌లోని(United States) ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోవడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. యునైటెడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF)లో ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ అడ్వైజర్ అపర్ణ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..‘యూఎస్ వర్సిటీలలో అమెరికన్ విద్యార్థులు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రాస్-కల్చరల్ ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ అవకాశం అమూల్యమైనది. గ్లోబల్ కెరీర్‌కు వేదికను నిర్దేశిస్తుంది.’ అని చెప్పారు.
ఈ ప్రత్యేక ప్రయోజనాలు చెన్నైకి చెందిన అరవింద్ నటరాజన్, సుధా ఎం.రాఘవన్‌లను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత చదువులు చదివేందుకు ప్రేరేపించిన అంశాల్లో ఒకటి. నటరాజన్ 2019లో న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరల్ డిగ్రీని అందుకున్నారు. అతను ఇప్పుడు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ ఫెలో. అదే విధంగా రాఘవన్ 2019లో పెన్సిల్వేనియాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నివసిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ, వారి విద్యా అనుభవాల గురించి నటరాజన్, రాఘవన్ వివరించిన అంశాలు తెలుసుకోండి.
U.S. యూనివర్శిటీలో చదవాలని ఎందుకు అనుకొన్నారు?
నటరాజన్: నా డాక్టోరల్ ప్రోగ్రామ్ కోసం. బ్యాక్టీరియల్ జెనెటిక్స్‌లో నా ఆసక్తికి అనుగుణంగా అవకాశాలను వెతకడానికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. నేను దరఖాస్తు చేసుకున్న ప్రోగ్రామ్‌లలో, కార్నెల్ విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజీ ప్రోగ్రామ్ నాకు ఆసక్తిని కలిగించే ప్రాజెక్ట్‌లను చేపడుతున్న మూడు అద్భుతమైన రీసెర్చ్ గ్రూప్‌లను అందించింది. అదనంగా ఈ గ్రూప్‌లకు గైడెన్స్ ఇస్తున్న అధ్యాపకులు నా ఆసక్తికి సంబంధించి ఇమెయిల్, వీడియో చాట్ ద్వారా నాతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లను చర్చించారు. నా పోస్ట్‌డాక్టోరల్ శిక్షణ కోసం, నేను యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసాను.
రాఘవన్: నా చిన్నప్పటి నుంచి ఆర్ట్, టెక్నాలజీకి సంబంధించిన కెరీర్‌ని కొనసాగించాలని అనుకున్నాను. చాలా మార్గాలను అన్వేషించిన తర్వాత, నేను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలు, కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. గ్రాఫిక్స్ రీసెర్చ్, ఫ్యూచరిస్టిక్ విజువల్ కంప్యూటింగ్ టెక్నాలజీలలో రాణిస్తున్న అనేక అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి. అంతేకాకుండా, వినోద పరిశ్రమ కు కేంద్రంగా, ప్రసిద్ధ సంస్థలు, కంపెనీలతో సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఫీల్డ్‌లోని నిపుణులతో కనెక్ట్ అవుతున్నప్పుడు నాకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంది?
నటరాజన్: నా డాక్టోరల్ ప్రోగ్రామ్ దరఖాస్తు ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. కానీ క్షుణ్ణంగా ఉండటం వల్ల నాకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడింది. మొదట, నేను రెండు నెలల పాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్‌పై పని చేశాను. నా తల్లిదండ్రులు, స్నేహితులు, సలహాదారుల నుండి వచ్చిన ఇన్‌పుట్‌లతో పూర్తి చేశాను. తర్వాత నేను ఆసక్తి ఉన్న ప్రతి ప్రోగ్రామ్‌పై రీసెర్చ్ చేశాను. అవసరమైన వివరాలు సేకరించాను. అవకాశాలు, ఆసక్తి, ఇతర అన్ని విభాగాల్లో సరిపడే ప్రోగ్రామ్‌ల జాబితా సిద్దం చేసుకొన్నాను.
రాఘవన్: నేను వీలైనంత త్వరగా నా స్కోర్లు, ట్రాన్స్క్రిప్ట్లను సిద్ధంగా ఉంచుకున్నాను . కాపీలను స్కాన్ చేసి నా దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేశాను. నేను స్ప్రెడ్షీట్తో ప్రారంభించాను, ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయం గడువు తేదీలు, ప్రోగ్రామ్ అవసరాలను ట్రాక్ చేయడం కష్టం. నా ఆసక్తులు విజువల్ ఆర్ట్స్‌లో ఉన్నందున, నేను ఎంచుకున్న చాలా కోర్సులకు అప్లికేషన్లో భాగంగా ఆన్లైన్ పోర్ట్‌ఫోలియో లేదా అసైన్‌మెంట్‌ని సమర్పించాల్సిన అవసరం ఉంది. అందుకు నా కాలేజీ ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షిప్‌ల వివరాలను యాడ్ చేశాను. అడ్మిట్లు పొందిన తర్వాత నా యూనివర్సిటీని ఎంచుకోవడానికి ఇది నాకు సహాయపడింది.
కొత్త దేశానికి వెళ్లి చదువుకోవడం ఎలా ఉంది?
నటరాజన్: న్యూయార్క్‌లోని ఇథాకాలో గృహాల కోసం వెతుకుతున్న సమయంలో అనేక తెలియని అంశాలు నేర్చుకున్నాను. అపార్ట్మెంట్లో ఎలాంటి సౌకర్యాలు చూడాలి, సురక్షితమైన, అనుకూలమైన స్థానాలను ఎలా గుర్తించాలి లేదా లీజు ఒప్పందాన్ని జాగ్రత్తగా ఎలా పరిశీలించాలి వంటివి నాకు తెలియదు. అందువల్ల నేను క్యాంపస్‌లో నివసించేందుకు నిర్ణయించుకొన్నాను. విశ్వవిద్యాలయం అంతటా సహచరులను పొందే అవకాశం కూడా నాకు లభించింది.
తరగతుల ప్రారంభం మంచి పనితీరును కనబరచాలనే ఉత్సాహం, ఆందోళనను తెచ్చిపెట్టింది. అమెరికన్ అకడమిక్ సిస్టమ్‌లో ఉండే అద్భుతమైన స్వేచ్ఛ నావిగేట్ చేయడానికి సవాలుగా ఉందని అర్థమైంది. ఇక్కడ మైక్రోబయాలజీ ప్రోగ్రామ్‌లోని ఫ్యాకల్టీ, పీర్ మెంటర్లు చాలా విలువైనవారు. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న తర్వాత ప్రోగ్రామ్ చాలా నచ్చింది.
రాఘవన్: నేను ఇతర విద్యార్థులతో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత చాలా రిసోర్స్‌లు కనిపించాయి. నేను కార్నెగీ మెల్లన్‌లో ఇన్కమింగ్ విద్యార్థుల కోసం రూపొందించిన Facebook గ్రూప్ ద్వారా నా రూమ్మేట్లు దొరికారు. అదే సమయంలో పిట్స్బర్గ్ చేరుకోవడానికి ప్రయాణ తేదీలను కూడా ప్లాన్ చేసాము. ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లు ముగిసిన వెంటనే మా తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచే సవాలుగా కనిపించింది. కానీ విసుగు చెందడానికి సమయం లేనందున ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను!
యూఎస్‌లో స్నేహాన్ని పెంచుకున్నారా? మీరు పాల్గొన్న క్లబ్బులు లేదా ఇతర సంస్థలు ఉన్నాయా?
నటరాజన్: నేను గ్రాడ్యుయేట్ స్కూల్లో ఉన్న సమయంలో, ఇప్పటికీ అనేక మార్గాల్లో నన్ను ప్రభావితం చేసే వివిధ రంగాల నుంచి స్నేహితులను సంపాదించాను. నేను చేసిన మొదటి స్నేహం భారతదేశం నుంచి ప్రయాణించిన తోటి విద్యార్థులతోనే. తర్వాత, నేను మైక్రోబయాలజీ ప్రోగ్రామ్‌లో కొందరిని కలిశాను. వారు నాకు అవసరమైన వస్తువులు కొనుక్కునేందుకు నాకు కారు లేకపోవడంతో తమతో తీసుకెళ్లేవారు. అమెరికా సంస్కృతి గురించి తెలుసుకొనేందుకు వారితో ఎక్కువ సమయం గడిపే వాడిని. నేను హౌసింగ్ కమ్యూనిటీలోని తోటి వారితో, స్టూడెంట్ ప్రోగ్రామ్స్, క్లబ్‌ల సభ్యులు, పట్టణంలోని సామాజిక కార్యక్రమాలలో నేను కలుసుకున్న వారితో కూడా స్నేహం చేశాను.
రాఘవన్: నా దగ్గరి స్నేహితులు చాలా మంది నా గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి వచ్చారు. నా రూమ్మేట్లు వేర్వేరు ప్రోగ్రామ్‌లలో చదువుతున్నారు. మేము ఎల్లప్పుడూ గ్రూప్ స్టడీ సెషన్లు లేదా సినిమా నైట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తాం. ఇది చాలా మంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశాన్ని అందజేసింది. చాలా డిపార్ట్మెంట్లు సోషల్ ఈవెంట్లు, కెరీర్ నెట్వర్కింగ్ ఈవెంట్లను నిర్వహించాయి. ఇవి విద్యార్థులను ఇతరులను ఆహ్వానించడానికి ఉపయోగపడతాయి.
యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత చదువులు చదవాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు మీరు ఏం చెబుతారు?
నటరాజన్: యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత విద్యను అభ్యసించమని నేను ప్రోత్సహిస్తాను. మీ ప్రపంచ దృష్టికోణాన్ని విస్తరింప జేయడానికి, విజయవంతమైన అనుభవాన్ని పొందేందుకు అవసరమైన వనరులు గురించి తెలుసుకునే అవకాశంగా ఉంటుంది.
రాఘవన్: నా మొదటి సలహా ఏంటంటే.. ముందుగా పరిశోధన ప్రారంభించడం. ప్రామాణిక పరీక్షలను ఎప్పుడు ఇవ్వాలో, దరఖాస్తు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలో ప్రణాళిక వేయడం చాలా ముఖ్యం. అడ్మిషన్ కమిటీకి మీరు వారికి సమర్పించే మెటీరియల్‌ల సెట్ ద్వారా మాత్రమే మీ గురించి తెలుస్తుంది. కాబట్టి మీ దరఖాస్తును వీలైనంత స్పష్టంగా ఉండేలా చూసుకోండి. చాలా వర్సిటీలు తమ అల్యూమినీని ప్రదర్శిస్తాయి. దీని ద్వారా వర్సిటీలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.