ఇటీవల డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీడియాలో మీ కెరీర్ తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా? మీడియాలో ఉద్యోగం చేయడం మీ కలా? అయితే భారతదేశంలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్ అయిన నెట్వర్క్18 (Network18) మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. మొదటి కెరీర్ మీడియాలో మొదలుపెట్టాలనుకునేవారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్ ఉద్యోగం పొందడం మాత్రమే కాదు ప్రొఫెషనల్‌గా ఎదగడానికి, బిజినెస్ ఇంటెలిజెన్స్ పొందడానికి, నిపుణుల మార్గదర్శకత్వంలో మీ స్కిల్స్ మెరుగుపర్చుకోవడానికి, విలువైన నెట్వర్క్ పెంపొందించుకోవడానికి, ఆ తర్వాత కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవాలని అనుకునేవారికి ఇది ఓ మంచి అవకాశం.
దేశవ్యాప్తంగా ఎడిటోరియల్, ప్రొడక్షన్ విభాగాల్లో ఫ్రెషర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది నెట్వర్క్18 (Network18). ఇటీవల డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులకు రెండు భాషలు తెలిసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వార్తలు సేకరించడం, రాయడంలో ఆసక్తి ఉండాలి. సృజనాత్మకతతో పాటు మల్టీ-టాస్కింగ్ తెలిసి ఉండాలి.
ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 243 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
నెట్వర్క్18 లో ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి.
Step 2- పుట్టిన తేదీ dd/MM/yyyy ఫార్మాట్‌లో ఎంటర్ చేయండి
Step 3- వేలిడ్‌లో ఉన్న మీ ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
Step 4- వేలిడ్‌లో ఉన్న మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
Step 5- మీరు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం టైప్ చేయండి.
Step 6- మీరు ఏ ప్రాంతంలో ఉద్యోగం కోరుకుంటున్నారో ఆ ప్రాంతం పేరు టైప్ చేయండి.
Step 7- మీరు డిగ్రీ పూర్తి చేసిన ఇన్‌స్టిట్యూట్, కోర్స్ పేరు ఎంటర్ చేయండి.
Step 8- మీరు పాస్ అవుట్ అయిన ఇయర్ సెలెక్ట్ చేయండి.
Step 9- మీరు ఫ్రెషరా కాదా అన్న విషయాన్ని వెల్లడించండి.
Step 10- మీరు అప్లై చేయాలనుకుంటున్న సెగ్మెంట్ సెలెక్ట్ చేయండి. బ్రాడ్‌క్యాస్ట్, డిజిటల్ సెగ్మెంట్లలో మీకు ఆసక్తి ఉన్న సెగ్మెంట్ ఎంచుకోండి. రెండు సెగ్మెంట్లు కూడా సెలెక్ట్ చేయొచ్చు.
Step 11- మీరు పనిచేయాలనుకుంటున్న విభాగాన్ని సెలెక్ట్ చేయండి. ఎడిటోరియల్ అండ్ కంటెంట్, ప్రొడక్షన్ విభాగాలు ఉంటాయి. రెండు విభాగాలు సెలెక్ట్ చేయొచ్చు.
Step 12- మీ బంధువులు ఎవరైనా రిలయన్స్ గ్రూప్, నెట్వర్క్18లో పనిచేస్తున్నట్టైతే ఆ విషయం వెల్లడించండి.
Step 13- ఏదైనా మెడికల్ హిస్టరీ ఉంటే వివరించండి.
Step 14- చివరి స్టెప్‌లో రిమార్క్స్ ఏవైనా ఉంటే టైప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Job notification, JOBS, Network18