Home /News /jobs /

UGC NET 2021: నెట్ 2021 ద‌ర‌ఖాస్తుల‌ స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం.. సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు గడువు

UGC NET 2021: నెట్ 2021 ద‌ర‌ఖాస్తుల‌ స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం.. సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు గడువు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నెష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) యూజీసీ నెట్ 2021 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవకాశం ఇచ్చింది. నెట్ జూన్ 2021, నెట్ డిసెంబ‌ర్ 2020 కంబైన్డ్ ప‌రీక్ష‌కు సంబంధించి సెప్టెంబ‌ర్ 7, 2021 నుంచి సెప్టెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అప్లికేష‌న్ ఫాంలో ఏమైన త‌ప్పులు ఉంటే స‌రిచేసుకొవచ్చు.

ఇంకా చదవండి ...
    నెష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) యూజీసీ నెట్ 2021 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవకాశం ఇచ్చింది. నెట్ జూన్ 2021, నెట్ డిసెంబ‌ర్ 2020 కంబైన్డ్ ప‌రీక్ష‌కు సంబంధించి సెప్టెంబ‌ర్ 7, 2021 నుంచి సెప్టెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అప్లికేష‌న్ ఫాంలో ఏమైన త‌ప్పులు ఉంటే స‌రిచేసుకొనే అవ‌కాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకొని త‌ప్పులు లేని స‌మాచారం అందించాల‌ని నెష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సూచించింది.
    సవరణలు చేసే విధానం..
    UGC NET జూన్ 2021 & డిసెంబర్ 2020 ఆన్‌లైన్ అప్లికేషన్(Application) ఫాంలో ఏవైనా సవరణలు చేయడానికి, అభ్యర్థులు NTA యొక్క అధికారిక వెబ్‌సైట్ అంటే ugcnet.nta.nic.inకి వెళ్లాలి.  ద‌ర‌ఖాస్తు స‌వ‌ర‌ణ కోసం విండో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

    - విండో తెరుచుకొన్న త‌రువాత గ‌తంలో అభ్య‌ర్థి ద‌ఖాస్తు చేసుకొన్న పాత వివ‌రాల‌తో లాగిన్ అవ్వాలి.

    KIOCL Recruitment 2021:కేఐఓసీఎల్‌లో కాంట్రాక్ట్ ఇంజ‌నీర్ పోస్టులు.. 


    - అనంత‌రం అప్లికేష‌న్ ఫాంలో అభ్య‌ర్థి అందించిన స‌మాచారం క‌న‌బ‌డుతుంది.
    - ఏమైన త‌ప్పులు, స‌వ‌ర‌ణ‌లు ఉంటే వాటిని స‌రి చేసి స‌బ్‌మిట్(Submit) చేయాలి.
    - స‌వ‌ర‌ణ అయిపోయిన త‌రువాత అభ్య‌ర్థి క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI మరియు PAYTM వాలెట్ ద్వారా ఆన్‌లైన్(online) స‌వ‌ర‌ణ ఫీజు చెల్లించాలి.
    - ఈ విండో సెప్టెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఆ త‌రువాత ఎటువంటి దిద్దుబాటుకు అవకాశం ఉండ‌దు.

    యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్​ రీసెర్చ్​ ఫెలోల ఎలిజిబిలిటీ కోసం ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నెట్(UGC-NET exam) పరీక్ష తేదీలు మారాయి. దేశంలో కోవిడ్​ పరిస్థితుల కారణంగా 2020 డిసెంబర్ సెషన్​ పరీక్షను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, ఈ పరీక్షను ఇప్పటికీ నిర్వహించలేదు. మరోవైపు, 2021 జూన్​ సెషన్​కు సైతం పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో.. రెండింటిటీ విలీనం చేసి కంబైన్(Combain)​గా పరీక్ష నిర్వహించాలని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్ణయించింది. కొత్త వారితో పాటు, 2020 డిసెంబర్​ సెషన్​కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు సైతం 2021 జూన్​ సెషన్​కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు సెషన్లకు సంబంధించిన కంబైన్డ్​ ఎగ్జామ్స్​ డేట్స్​ను ప్రకటించింది. కొత్త పరీక్షల షెడ్యూల్ ప్రకారం, యూజీసీ నెట్​ పరీక్షలు రెండు బ్లాకులుగా జరగనున్నాయి.

    అక్టోబర్ 6 నుంచి -8 వరకు ఒక బ్లాక్​, తిరిగి అక్టోబర్ 17 నుంచి -19 వరకు మరో బ్లాక్​లో పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే, గతంలో విడులైన షెడ్యూల్(Shdedule)​ ప్రకారం యూజీసీ నెట్​ 2021 పరీక్షలు(Exams) అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ, అక్టోబర్​ 10న కొన్ని పోటీ పరీక్షల ఉన్నందున అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు షెడ్యూల్ మారుస్తూ ఎన్​టీఏ నిర్ణయం తీసుకుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు