Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం

Nestle India virtual paid internship | మీరు ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా? ఆసక్తి ఉంటే ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. నెస్లే ఇండియా వర్చువల్ పెయిట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

news18-telugu
Updated: July 9, 2020, 1:20 PM IST
Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం
Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మల్టీ నేషనల్ కంపెనీ నెస్లే ఇండియా వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. Nesternship పేరుతో 1000 యువతకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను ఇస్తోంది నెస్లే ఇండియా. నాలుగు నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 8న ప్రారంభమైంది. ఆగస్ట్ 1న ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. నెలకు 250 మంది చొప్పున నవంబర్ వరకు ఇంటర్న్‌షిప్ కొనసాగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు నెస్లే ఇండియా అధికారిక వెబ్‍సైట్ లేదా ఇంటర్న్‌శాలా ప్లాట్‌ఫామ్‌లో అప్లై చేయొచ్చు. జూలై 10 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

MCA course: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసీఏ ఇక రెండేళ్లే

Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?edu

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ అందిస్తోంది నెస్లే ఇండియా. విద్యార్థులు 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ మార్కులు, గతంలో చేసిన ఇంటర్న్‌షిప్స్, అనుభవం లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేయనుంది నెస్లే ఇండియా. విద్యార్థుల సాఫ్ట్ స్కిల్స్ పెంచేందుకు ఈ ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. ప్రీ-రికార్డెడ్ లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి. విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు సీవీ క్లినిక్ కూడా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు స్టైపెండ్‌తో పాటు సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading