NEET UG 2022 ఫలితాల ప్రకటన కోసం 18 లక్షల మందికి పైగా వైద్య ఆశావహులు ఎదురుచూస్తున్నారు. NTA యూజీ పరీక్ష ఫలితాల తేదీ మరియు ఫైనల్ కీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది. దీనికి సంబంధించి అధికారిక వెబ్ సైట్లో ఓ నోటీస్ ను వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్, NEET UG 2022 నిర్వహించి 1 నెల కంటే ఎక్కువ సమయం గడిచింది. అయితే ఇప్పటి వరకు పరీక్షకు ఎలాంటి అప్ డేట్ రాకపోవడం.. కనీసం కీ కూడా వెబ్ సైట్లో అందుబాటులోకి రాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. NEET UG 2022 పరీక్షను జూలై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించడం గమనార్హం. అయితే తాజాగా ఈ ఫలితాలకు సంబంధించి ఎట్టకేలకు ఓ ప్రకటన వెలువడింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (యుజి) 2022 ఫలితాలను సెప్టెంబర్ 7 నాటికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నీట్-యుజి ఆన్సర్ కీని ఆగస్టు 30, 2022న విడుదల చేస్తామని అధికారిక వెబ్సైట్లో నోటీస్ ను పోస్టు చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆగస్టు 30 నుండి ఆన్సర్ కీ మరియు రికార్డ్ చేసిన రెస్పాన్స్ ఛాలెంజ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో జవాబు కీకి వరుసగా రూ.200 మరియు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, NEET UG 2022 ఫలితాలు విడుదలైన తర్వాత.. తదుపరి అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. దీనికి సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
NEET UG ఫలితాలు విడుదలైన తర్వాత.. కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుందని అందరికీ తెలిసిందే. దీని కింద రెండు కోటాలు ఉంటాయి. ఇందులో 15 శాతం ఆల్ ఇండియా కోటా కింద.. అదే 85 శాతం రాష్ట్రాలకు కేటాయిస్తారు.
ఆల్ ఇండియా కోటాలోని 15 శాతం సీట్ల కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కౌన్సెలింగ్‌ని నిర్వహిస్తుంది. దీని ద్వారా ఎంబీబీఎస్‌లో 91,000, బీడీఎస్‌లో 27,000, ఆయుష్‌లో 52700, ఎయిమ్స్‌లో 1,900, జిప్మర్లో 250 సీట్లు ఇస్తారు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ నాలుగు రౌండ్లలో జరుగుతుంది. ఇందులో ఫస్ట్, సెకండ్, మాప్ అప్ రౌండ్ మరియు స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటాయి. MCC ప్రతి రౌండ్ తర్వాత ప్రవేశానికి కటాఫ్‌ను విడుదల చేస్తుంది.
మరోవైపు.. 85 శాతం రాష్ట్ర కోటా కోసం రాష్ట్రాలచే కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. ప్రైవేట్ కాలేజీల 100 శాతం సీట్ల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.
NEET UG 2022 పరీక్షకు దాదాపు 18 లక్షల మంది వైద్య ఆశావహులు హాజరయ్యారు. సరిగ్గా చెప్పాలంటే, మెడికల్ ప్రవేశ పరీక్షకు మొత్తం 18,72,329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. వారిలో 10.64 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 2022 సెషన్ కోసం.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య మునుపటి సంవత్సరంతో పోలిస్తే దాదాపు 2.5 లక్షలు పెరిగింది. భారతదేశం వెలుపల ఉన్న 14 నగరాలతో సహా 497 నగరాల్లోని 3,570 కేంద్రాలలో జూలై 17న పరీక్ష జరిగింది. పరీక్ష ఆఫ్‌లైన్ లేదా పెన్-అండ్-పేపర్ మోడ్‌లో జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET, NEET 2022, Neet exam