• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NEET UG HERE IS THE LIST OF MEDICAL COLLEGES CHOSEN BY TOP 200 STUDENTS OF NEET 2020 NS GH

NEET UG: నీట్ యూజీ ఎగ్జామ్​ రాస్తున్నారా? అయితే, గతేడాది టాప్​ ర్యాంకర్లు ఎంచుకున్న కాలేజీల వివరాలను తెలుసుకోండి

NEET UG: నీట్ యూజీ ఎగ్జామ్​ రాస్తున్నారా? అయితే, గతేడాది టాప్​ ర్యాంకర్లు ఎంచుకున్న కాలేజీల వివరాలను తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల నీట్–యూజీ 2021​ నోటిఫికేషన్​ ను ఎన్టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్​ 1వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నీట్​ కనీస అర్హత మార్కులు? ఏ స్కోరుకు ఏ కాలేజీలో సీటొస్తుంది? గతేడాది టాప్​ ర్యాంకర్లు ఏ కాలేజీలను ఎంచుకున్నారు? తదితర విషయాలను తెలుసుకుందాం.

  • Share this:
నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​(నీట్​)–అండర్​ గ్రాడ్యుయేట్​(యూజీ) టెస్ట్ సంక్షిప్తంగా నీట్–యూజీ టెస్ట్​. జాతీయ స్థాయిలో సెంట్రల్​ ​యూనివర్సిటీలు, స్టేట్​ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్​ ఇన్​స్టిట్యూట్స్​లో ఎంబీబీఎస్​, బీడీఎస్​లతో పాటు ఆయుష్​ కోర్సుల్లో చేరాలంటే నీట్​ స్కోరే ప్రధానం. నీట్​లో సాధించిన స్కోర్​ ఆధారంగానే ఆయా మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, 2020 నుండి ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్ లాల్ నెహ్రూ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లలో మెడికల్​ ప్రవేశాలు సైతం నీట్ ద్వారానే జరుగుతున్నాయి. అంతకుముందు, ఎయిమ్స్, జిప్ మర్ రెండూ తమ సొంత ప్రవేశ పరీక్షలను నిర్వహించుకునేవి. అందుకే, ఈ పరీక్షకు ఏటా దేశవ్యాప్తంగా ఏటా పోటీ పెరుగుతోంది. ఇటీవల నీట్–యూజీ 2021​ నోటిఫికేషన్​ విడుదల చేసిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ అధికారికంగా పరీక్ష తేదీని ప్రకటించింది. ఆగస్ట్​ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నీట్​ కనీస అర్హత మార్కులు? ఏ స్కోరుకు ఏ కాలేజీలో సీటొస్తుంది? గతేడాది టాప్​ ర్యాంకర్లు ఏ కాలేజీలను ఎంచుకున్నారు? వంటి విషయాలను తెలుసుకుందాం.

నీట్​లో అర్హత సాధించాలంటే..
నీట్ ఉత్తీర్ణత సాధించడానికి జనరల్​ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 45 శాతం, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 40 శాతం స్కోర్​ సాధించాల్సి ఉంటుంది. అయితే, ప్రతిష్టాత్మక మెడికల్​ కాలేజీలో సీటు దక్కించుకోవాలంటే మాత్రం మొత్తం 720 మార్కులకు గాను కనీసం 600 మార్కులకు పైగా స్కోర్ చేయవలసి ఉంటుంది. నీట్–2020 పరీక్ష సరళిని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గతేడాది మొత్తం 13,66,945 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 7,71,500 మంది అర్హత సాధించారు. నీట్–2020లో ఒడిశాకు చెందిన షోయెబ్ అఫ్తాబ్ మొత్తం 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్​గా నిలిచాడు. ఇక, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ కూడా 720 మార్కులు సాధించి AIR 2 ర్యాంకు దక్కించుకుంది.

గతేడాది టాప్ 200 ర్యాంకర్లు ఎంచుకున్న కాలేజీలు..
1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూ ఢిల్లీ
2. జవహర్‌లాల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్ మర్), పుదుచ్చేరి
3. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల, పూణే
4. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, న్యూ ఢిల్లీ
5. ప్రభుత్వ వైద్య కళాశాల, కోటా
6. సవాయి మన్ సింగ్ (S.M.S.) మెడికల్ కాలేజీ, జైపూర్

7. ప్రభుత్వ వైద్య కళాశాల, తిరువనంతపురం
8. వీఎంఎంసీ అండ్ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూ ఢిల్లీ
9. సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీ, ముంబై
10. గవర్నమెంట్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​, చంఢీగర్​
11. ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జోధ్​పూర్
12. ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), భోపాల్

13. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, న్యూ ఢిల్లీ
14. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యుసీఎంఎస్), న్యూ ఢిల్లీ
15. మదురై మెడికల్ కాలేజీ, మదురై
16. పండిట్ దీన్‌ దయాల్ ఉపాధ్యాయ వైద్య కళాశాల, రాజ్‌కోట్
17. ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), బీబీనగర్, తెలంగాణ
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు