హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలివే..

NEET 2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022: నీట్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారం.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ / డెంటల్ కోర్సుల్లోని అన్ని సీట్లకు NEET (UG) - 2022 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ యూజీ (NEET UG) పరీక్షను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను జులై 17న నిర్వహించగా, ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. త్వరలో నీట్ కౌన్సెలింగ్ (NEET Counselling) కూడా జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేయనుంది. అయితే కౌన్సెలింగ్‌ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లతో పాటు అడ్మిషన్ ప్రాసెస్ వివరాలు తెలుసుకుందాం.

నీట్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారం.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ / డెంటల్ కోర్సుల్లోని అన్ని సీట్లకు NEET (UG) - 2022 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.

* నీట్ -2022 కౌన్సెలింగ్‌కు అవసరమైన డాక్యుమెంట్లు

కొన్ని నివేదికల ప్రకారం.. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఒకసారి డిపాజిట్ చేసిన ఫీజును తిరిగి వాపస్ ఇవ్వరు. కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. నీట్ అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్, అభ్యర్థి ఫోటో, సంతకం, బర్త్ సర్టిఫికేట్ లేదా 10వ పాస్ సర్టిఫికేట్, 12వ మార్క్ షీట్, కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే), క్యారెక్టర్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ఫ్రూప్ వంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.

* సీట్ల వివరాలు

నీట్ అడ్మిషన్ ప్రక్రియలో వివిధ కేటగిరీల సీట్లు ఉంటాయి. ఈ జాబితాలో ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, కేంద్రీయ సంస్థలు/యూనివర్సిటీలు/డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు, ప్రైవేట్ మెడికల్/డెంటల్ కాలేజీలు లేదా ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో స్టేట్/మేనేజ్‌మెంట్/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, సెంట్రల్ పూల్ కోటా సీట్లు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్/ఎయిడెడ్ మైనారిటీ/నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా అలాగే మేనేజ్‌మెంట్ సీట్లు, దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు/JIPMER కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

* నీట్ -2022 కౌన్సెలింగ్ రౌండ్స్

నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మల్టిపుల్ రౌండ్స్‌లో జరుగుతుంది. ఇందులో రౌండ్-1, రౌండ్-2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వెకెన్సీ రౌండ్ ఉంటుంది. కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థుల అర్హత ప్రమాణాల్లో భాగంగా సెల్ఫ్-డిక్లరేషన్, వివిధ డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్/డెంటల్ కాలేజీల నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హత ప్రమాణాలను ధ్రువీకరించనున్నారు. కొత్త/తాజా రిజిస్ట్రేషన్లను AIQ రౌండ్ 1, AIQ రౌండ్ 2, AIQ మాప్-అప్ రౌండ్ల కోసం మాత్రమే చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి : విద్యార్థినులకు అలర్ట్.. ఉమెన్ హాస్టళ్లలో హిడెన్ కెమెరాలను ఇలా గుర్తించండి..

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ ((ABVIMS & RML హాస్పిటల్/VMMC & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్/ESIC), సెంట్రల్ యూనివర్శిటీలు (DU/ BHU/AMU)/ AIIMS/ JIPMER), డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ / డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ చేపట్టనుంది.

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC).. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (AFMC) కోసం రిజిస్ట్రేషన్‌ మాత్రమే నిర్వహిస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థుల డేటాను AFMC అధికారులకు ఫార్వర్డ్ చేస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే ఇతర రిలవెంట్ కోర్సుల ప్రవేశాల కోసం కూడా నీట్ స్కోర్‌ను అడగవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET 2022

ఉత్తమ కథలు