దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీ (Medical College) ల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా నీట్ యూజీ (NEET- UG)ను నిర్వహిస్తారు. ఇందు కోసం ప్రిపేర్ అవుతున్న ఔత్సాహిక అభ్యర్థులు నీట్ యూజీని వాయిదా వేయాలని, గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #ModiJideferNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, నీట్‌ను నిర్వహించే ఏజెన్సీ ఎన్‌టీఏ, పరీక్ష వాయిదాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. షెడ్యూల్ ప్రకారం నీట్ పరీక్ష జూలై 17న జరగనుంది.
Agnipath Scheme: యువత కోసం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్.. ఏమిటి ప్రత్యేకతలు.. వివరాలు
NEET-UG 2021 సంవత్సరానికి సంబంధించిన కౌన్సిలింగ్ మార్చిలో ముగియడంతో, ఈసారి నీట్ పరీక్షకు సన్నద్ధం కావడానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా సీబీఎస్‌ఈకి సంబంధించి 12 తరగతి పరీక్షలు జూన్ 15న ముగుస్తున్నాయని, దీంతో తొలిసారి నీట్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉందన్న విషయాన్ని విద్యార్థులు హైలైట్6 చేస్తున్నారు. కాబట్టి నీట్ -2022 పరీక్షను కనీసం నాలుగు నుంచి ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
ఇందుకోసం చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతున్నారు. శివాలిక రాథర్ అనే ఔత్సాహిక అభ్యర్థి ట్విట్టర్‌లో ఇలా స్పందించింది. నీట్ యూజీ వాయిదా కోసం మేం పోరాడుతుంటే.. కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
‘గతేడాది నీట్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించారు. ఈసారి మాత్రం జూలై 17నే నిర్వహించాలని చూస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం పరీక్షకు సన్నద్ధం కావడానికి కనీసం 10 నెలల సమయం కూడా లేదు. అయితే ఫలితాల ప్రకటన, కౌన్సిలింగ్ చేపట్టానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటారు. మొత్తం మీద ఎన్‌టీఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. దీని వల్ల మేమెందుకు ఇబ్బందులు పడాలి.’ అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
నీట్‌ను కనీసం ఒక నెల వాయిదా వేయాలని నవనీత్ సింగ్ అనే మరో అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. అస్నా అనే ఔత్సాహిక అభ్యర్థి ఈవిధంగా స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే తరగతులకు ఈ ఏడాది జూలైలో నీట్ యూజీ నిర్వహించడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. దీంతో కౌన్సిలింగ్ కోసం దాదాపు 6 నెలల సమయం వృథా అవుతుందన్నారు. కాబట్టి కౌన్సిలింగ్ కోసం ఎదురుచూడడం కంటే 40-60 రోజులు అదనంగా చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
జాతీయ స్థాయిలో జరిగే ఇతర ప్రవేశ పరీక్షల తేదీలతో నీట్ క్లాష్ అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 10,000 మందికి పైగా ఔత్సాహిక అభ్యర్థులు నీట్ ను వాయిదా వేయాలని కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి లేఖలు కూడా రాశారు. ఢిల్లీ యూనివర్శిటీ, జామియా, జేఎన్‌యూతో సహా వివిధ సెంట్రల్ యూనివర్సిటీలు అందించే యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టే సీయూఈటీ పరీక్ష జూలై మొదటి లేదా రెండో వారంలోనే జరగనుంది. ఇది నీట్‌తో క్లాష్ అవుతుందన్న విషయాన్ని లేఖల ద్వారా ఏన్‌టీఏ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నీట్‌కు సిద్ధం కావడానికి అదనంగా మరో 40 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాలని ఔత్సాహిక అభ్యర్థులు ఎన్‌టీఏను కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET 2021, NEET 2022