హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET UG-2023: నీట్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం.. వివిధ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ సీట్ల వివరాలివే

NEET UG-2023: నీట్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం.. వివిధ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ సీట్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ద్వారా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మెరుగైన స్కోర్‌ సాధించేందుకు కొందరు విద్యార్థులు సంవత్సరాలు తరబడి ప్రిపేర్‌ అవుతుంటారు. అయితే నీట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎన్‌టీఏ త్వరలో చేపట్టనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

NEET UG-2023 : దేశంలో ఇంజనీరింగ్‌ తర్వాత ఎక్కువ మంది చదివేది మెడిసిన్‌. ప్రతిష్టాత్మక కళాశాలలో మెడిసిన్‌ సీట్‌ సంపాదించడం అంత సులువు కాదు. ప్రస్తుతం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) ద్వారా వైద్య కళాశాలల్లో(Medical colleges) ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మెరుగైన స్కోర్‌ సాధించేందుకు కొందరు విద్యార్థులు సంవత్సరాలు తరబడి ప్రిపేర్‌ అవుతుంటారు. అయితే నీట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎన్‌టీఏ త్వరలో చేపట్టనుంది. రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయిన తరువాత ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ neet.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 నీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్

ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి నీట్ యూజీ-2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్‌ను ఫిల్‌అప్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత పేమెంట్ చేసి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం నీట్ యూజీ -2023 కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోవాలి.

ఇన్ఫర్మేషన్ బులిటెన్‌‌లో వివరాలు

నీట్ యూజీ అప్లికేషన్ ఫీజు, అడ్మిట్ కార్డ్ వివరాలను ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ఎన్‌టీఏ వెల్లడించనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం సంబంధిత నియంత్రణ సంస్థలు నోటిఫై చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ చేపట్టనుంది.

CTET Result: ఈ వారంలోనే సీటెట్ పరీక్ష ఫలితాలు? లేటెస్ట్‌ అప్‌డేట్ వివరాలు మీకోసం

 మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ సీట్ల వివరాలు

ప్రతి ఏటా 15 లక్షల నుంచి 18 లక్షల మంది అభ్యర్థులు మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరవుతారు. నీట్ యూజీ -2023 ద్వారా ఎంబీబీఎస్‌లో 91,827 సీట్లకు అడ్మిషన్స్ కల్పించనున్నారు. బీడీఎస్ - 52,720, ఆయూష్‌-487, బీఎస్‌సీ నర్సింగ్-487, బీవీఎస్‌సీ-603, ఎయిమ్స్ ఎంబీబీఎస్-1899, జిప్‌మర్ ఎంబీబీఎస్-249 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. కాగా, నీట్ పరీక్ష మే 7న దేశవ్యాప్తంగా వివిధ ఎగ్జామ్ సెంటర్స్‌లో నిర్వహించనున్నారు.

పెన్ అండ్ పేపర్ మోడ్‌లో పరీక్ష

నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. నీట్‌ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ నుంచి మొత్తంగా 100 ప్రశ్నలు ఉంటాయి. కాగా, నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.

First published:

Tags: JOBS, Medical study, NEET, Neet exam

ఉత్తమ కథలు