హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2023: త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌ వివరాలివే..

NEET 2023: త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2023: జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ అభ్యర్థులకు సంబంధించి ఓ అప్‌డేట్‌ ఉంది. త్వరలోనే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో పరీక్షల కాలం (Exams Season) మొదలైపోయింది. వరుసగా వివిధ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లు, బోర్డు పరీక్షల అప్‌డేట్‌లు వస్తున్నాయి. విద్యార్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ అభ్యర్థులకు సంబంధించి ఓ అప్‌డేట్‌ ఉంది. త్వరలోనే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET)-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* మే 7న పరీక్ష

షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ-2023 మే 7న జరగనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్స్ neet.nta.nic.in లేదా nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

* నీట్ అప్లికేషన్ ప్రాసెస్

ముందుగా NTA అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి నీట్ యూజీ-2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసి లాంగిన్ అవ్వాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలను, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. చివరగా అప్లికేషన్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

* గరిష్ట వయోపరిమితి తొలగింపు

పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ నీట్‌కు సంబంధించి గతేడాది గరిష్ట వయోపరిమితి నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నీట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వయోపరిమితి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. ప్రస్తుతం 17 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థులు మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

ఇది కూడా చదవండి : సీయూఈటీ ఎగ్జామ్‌ ద్వారా టాప్‌ వర్సిటీల్లో అడ్మిషన్స్‌.. లిస్ట్ లో ఉన్న కళాశాలలు ఇవే!

* ఎగ్జామ్ ప్యాటర్న్‌

నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. నీట్‌ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది.

ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ నుంచి మొత్తంగా 100 ప్రశ్నలు ఉంటాయి.

* 13 భాషల్లో పరీక్ష

నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. కాగా, నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారని ఇటీవల ఊహాగాలు ఊపందుకోవడంతో ఎన్‌టీఏ స్పందించింది. నీట్ పరీక్షను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET, Neet applications

ఉత్తమ కథలు