హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2023: డిసెంబర్‌లో నీట్-2023 నోటిఫికేషన్ రీలీజ్..? సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ ఇతర వివరాలు ఇవే..

NEET 2023: డిసెంబర్‌లో నీట్-2023 నోటిఫికేషన్ రీలీజ్..? సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ ఇతర వివరాలు ఇవే..

NEET 2023: డిసెంబర్‌లో నీట్-2023 నోటిఫికేషన్ రీలీజ్..? సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ ఇతర వివరాలు ఇవే..

NEET 2023: డిసెంబర్‌లో నీట్-2023 నోటిఫికేషన్ రీలీజ్..? సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ ఇతర వివరాలు ఇవే..

దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీ కోసం ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహిస్తోంది. నీట్-2023కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ డిసెంబర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

డాక్టర్‌(Doctor) కావాలని కలలు కనే ప్రతి విద్యార్థికి నీట్‌ ఎగ్జామ్‌ కీలకం. ఈ ఎగ్జామ్‌లో విజయం సాధించేందుకు విద్యార్థులు చాలా శ్రమిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో పోటీపడాల్సి ఉంటుంది. దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీ కోసం ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహిస్తోంది. నీట్-2023కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ డిసెంబర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌లో నీట్ పరీక్ష తేదీలు, దరఖాస్తు ఫారమ్, సమాచార బులెటిన్ వివరాలు ఉంటాయి. నీట్-2023 నోటిఫికేషన్ విడుదలైన తరువాత అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అందుబాటులోకి రానుంది.

* అర్హత ప్రమాణాలు

భారతీయ పౌరులు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs), భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు (PIOs) లేదా విదేశీ జాతీయులు కూడా నీట్ పరీక్ష రాయడానికి అర్హులు. ఇంటర్ పాసైన అభ్యర్థులు, లేదా పరీక్షలకు హాజరైన వారు లేదా ఇంటర్‌కు సమానమైన కోర్సు చేసినవారు మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-2023 కు దరఖాస్తు చేసుకోవచ్చు.

* దరఖాస్తు విధానం

ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను సందర్శించాలి. హోమ్‌పేజీలో ‘‘Apply For NEET 2023” ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తరువాత అవసరమైన వివరాలు ఎంటర్‌ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలి. చివరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్‌ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్‌ తీసుకోవాలి.

* అవసరమయ్యే డాక్యుమెంట్లు

నీట్-2023 రిజిస్ట్రేషన్ కోసం పోస్ట్‌కార్డ్ సైజు ఫోటో, ఎడమ చేతి బొటనవేలు ఫింగర్‌ప్రింట్‌, అభ్యర్థి సిగ్నేచర్‌, J&K అభ్యర్థులైతే సెల్ఫ్-డిక్లరేషన్ సర్టిఫికెట్, కేటగిరీ సర్టిఫికెట్ (వర్తిస్తే), 10వ తరగతి సర్టిఫికెట్, ఎంబసీ/పౌరసత్వ ధృవీకరణ పత్రం

TSPSC Update: అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలపై కీలక ప్రకటన..

* నీట్-2023 సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్

11, 12వ తరగతికి చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నీట్ ప్రశ్నలు వస్తాయి. నీట్-2023 పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరుగుతుంది. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయించనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేస్తారు.

13 భారతీయ భాషల్లో ఎగ్జామ్‌

నీట్-2022 సమాచార బులెటిన్ ప్రకారం.. పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ వంటి 13 భారతీయ భాషల్లో నీట్ జరగనుంది. అభ్యర్థులు ఏదో ఒక లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

First published:

Tags: Career and Courses, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు