Home /News /jobs /

NEET UG 2022 HERE IS THE LIST OF BEST SCORING TOPICS IN NEET UG ZOOLOGY SUBJECT NS VNL NJ

NEET Zoology Tips: జువాలజీలో ఈ టాపిక్స్‌ ప్రిపేర్‌ అయితేచాలు.. నీట్‌ లో బెస్ట్ స్కోర్.. తప్పక తెలుసుకోండి

బాలకృష్ణ, లెక్చరర్

బాలకృష్ణ, లెక్చరర్

నీట్‌(NEET-2022) పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేశారు..వాటిని గమనించి విద్యార్థుల ప్రిపరేషన్‌ ఉండాలంటున్నారు జువాలజీ లెక్చరర్ బాలకృష్ణ. మానవ శరీర వ్యవస్థపైనే ఎక్కువ మార్కులు వస్తాయని..ఆ టాపిక్‌పై దృష్టి పెడితే ఈజీగా స్కోర్‌ చేయొచ్చంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...
  (Neelima, Visakhapatnam, News18)
  నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అనేది భారతీయ వైద్య మరియు దంత కళాశాలల్లో MBBS మరియు BDS ప్రోగ్రామ్‌లకు అర్హత పరీక్ష. దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. NEET 2022 పరీక్షా విధానంతో సరైన అవగాహన లేకుంటే ..అది రాసే విద్యార్థులకు ప్రిపరేషన్‌ ఎలా చేయాలో అర్థం కాదు.
  ఈ సంవత్సరం పరీక్ష విధానం మార్చారు. ఇది విద్యార్థులకు కొత్త ఫార్మాట్ మాత్రమే కాదు కాస్త సవాల్‌గా కూడా ఉంటుంది. MBBS, BDS లేదా ఇతర వైద్య కోర్సులను అభ్యసించాలనుకునే వైద్య అభ్యర్థులు తప్పనిసరిగా NEET UG 2022 పరీక్షా విధానంతో పాటు వారి ప్రిపరేషన్ ప్రయత్నాలతో అవగాహన కలిగి ఉండాలి. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి, వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

  బయోలజీ ఎగ్జామ్‌లో జువాలజీ అండ్‌ బోటనీ రెండు సబ్జెక్ట్స్‌లు ఉంటాయి. ఈ రెండింటిలోనూ ఒక్కో సబ్జెట్‌కు రెండు సెక్షన్‌లుగా విభజించారు. సెక్షన్ Aలో 35 ప్రశ్నలు ఉండగా, సెక్షన్ Bలో 15 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలోని ఈ 15 ప్రశ్నల్లో అభ్యర్థులు 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
  NEET Admit Card: నీట్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారా..? రిపోర్టింగ్ టైమ్, OMR షీట్ అవైలబిలిటీ, ఇతర రూల్స్ చెక్ చేయండి..!

  ముందుగా ఈ సంవత్సరం 2022 NEET పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం NEET పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు.. కానీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల జాప్యం కారణంగా… ఈ ఏడాది జూలై నెలలో నిర్వహిస్తున్నారు.
  NEET 2022: నీట్ 2021 టాపర్లు మెడికల్ పరీక్షకు ఎలా సిద్ధమయ్యారో తెలుసా! వారి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!

  నీట్ జువాలజీ సబ్జెక్ట్‌లో సులభంగా స్కోర్ చేయాలనుకుంటున్నారా...? అయితే మీరు కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు వైజాగ్‌లోని SR ఎడ్యుకేషనల్ అకాడమీ జువాలజీ లెక్చరర్‌ బాలకృష్ణ..

  మానవ శరీర వ్యవస్థలపై దృష్టి సారించాలి..!
  శ్వాసకోశ వ్యవస్థ(respiratory system), జీర్ణవ్యవస్థ(digestive system) మొదలైన వివిధ వ్యవస్థలను కలిగి ఉన్న మానవ శరీరధర్మశాస్త్రం(human physiology) నుండి 15 ప్రశ్నలు అడుగుతారు కనుక వీటిని ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తే 15 మార్కులు పొందొచ్చంటున్నారు బాలకృష్ణ.

  అంటపరిమాణం, జన్యుశాస్త్రంపై ఆరు ప్రశ్నలు..!
  బొద్దింక గురించి తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది. కనుక ఇది ప్రిపేర్ అవండి. వానపాము, కప్పలకు సంబంధించినవి సిలబస్‌ నుంచి తొలగించారు కనుక వాటిని అంతగా పట్టించుకోనక్కర్లేదు. అంటపరిణామం (evolution) మరియు జన్యుశాస్త్రం (genetics) కఠినమైనప్పటికీ.. ఈ అంశం నుండి ఎగ్జామ్‌లో ఆరు ప్రశ్నలు అడుగుతారు. కనుక, ఈ టాపిక్స్‌పై దృష్టి పెడితే ఈజీగా ఆరు మార్కులు పొందచ్చని సూచిస్తున్నారు బాలకృష్ణ.

  ముఖ్యంగా దృష్ఙి పెట్టాల్సిన అంశాలు :
  పరిణామం , పశుసంరక్షణ , బొద్దింక , జంతు వైవిధ్యం, మానవ పునరుత్పత్తి, మానవ ఆరోగ్యం మరియు వ్యాధి, జంతు కణజాలం, హ్యూమన్ ఫిజియాలజీ

  ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) బుక్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి..!
  నీట్ పరీక్ష కోసం ప్రిపరేషన్ కోసం NCERT పాఠ్య పుస్తకాలను ఉపయోగిస్తే చాలా సులభంగా మార్కులు పొందచ్చంటున్నారు బాలకృష్ణ. NCERT బుక్స్‌ నుంచి అన్ని ఉదాహరణలు, ఫ్లో చార్ట్‌లు, రేఖా చిత్రాలు మొదలైనవి ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు. అధిక మార్కులు మరియు మంచి ర్యాంక్ సాధించాలనుకునే వ్యక్తి NCERT పాఠ్యపుస్తకాలను చదవితే..వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని జువాలజీ ప్రొఫెసర్‌ బాలకృష్ణ తెలిపారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, JOBS, NEET 2022

  తదుపరి వార్తలు