Home /News /jobs /

NEET UG 2022 HERE IS THE LIST OF BEST SCORING TOPICS IN NEET UG BOTANY SUBJECT VNL NJ VB

NEET Botany Tips: బోటనీలో ఈ టాపిక్స్‌ ప్రిపేర్‌ అయితే చాలు.. నీట్‌(NEET)లో బెస్ట్ స్కోర్ మీ సొంతం..

ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

సరైన ప్రణాళికతో చదివితే నీట్‌-2022 ఎగ్జామ్‌లో బోటనిలో బెస్ట్ స్కోర్‌ చేయోచ్చంటున్నారు ప్రొపెసర్‌ మురళీకృష్ణ. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ నుంచి ఎన్నెన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో తెలుకుని వాటి ప్రకారం చదివితే బెటర్‌ అంటున్నారు.

ఇంకా చదవండి ...
    (Neelima, Visakhapatnam, News18)

    దేశవ్యాప్తంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్ల భర్తీకోసం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(NEET-2022) నిర్వహిస్తున్నారు. దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో జులై 17న మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు.

    పరీక్షా విధానం:
    నీట్‌ 2022 పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కాల పరిమితి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి సరైన ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానికి ఒక మార్కును కోసేస్తారు.

    NEET 2022: నీట్ 2021 టాపర్లు మెడికల్ పరీక్షకు ఎలా సిద్ధమయ్యారో తెలుసా! వారి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!

    నీట్ బోటనీ సబ్జెక్ట్‌లో సులభంగా స్కోర్ చేయాలనుకుంటున్నారా...? అయితే మీరు కొన్ని అంశాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది అని SR ఎడ్యుకేషనల్ అకాడమీ బోటనీ లెక్చరర్‌ మురళీకృష్ణ తెలిపారు.
    బోటనీ సబ్జెక్ట్‌లో మూడు రకాల ప్రశ్నలు విద్యార్థులకు వస్తుంటాయి. ఒకటి బొమ్మల ఆధారంగా…మరొకటి విశ్లేషాణాత్మకం, ఇంకొకటి జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు.

    జనెటిక్స్‌ అండ్‌ మాలిక్యులర్‌ బేసిస్‌ ఇన్‌హెరిటెన్స్‌ (genetics and molecular basis inheritance) వంటి అధ్యాయాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు RNA, DNA నిర్మాణాలు, జన్యు సంకేతం (genetic code), ప్రోటీన్ సంశ్లేషణ మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయంటున్నారు మురళీ కృష్ణ.

    NEET Admit Card: నీట్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారా..? రిపోర్టింగ్ టైమ్, OMR షీట్ అవైలబిలిటీ, ఇతర రూల్స్ చెక్ చేయండి..!

    మొక్క ఎదుగుదల దశలు( plant transportation) , జీవ వర్గీకరణ మరియు మొక్కల రాజ్యం (biological classification and plant kingdom) వంటి అధ్యాయాలు నుండి చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇలా కొన్ని జ్ఞాపకశక్తి మీద ఆధారపడే ప్రశ్నలను బట్టిపడితే సమయం ఆదాఅవుతుందంటున్నారు.

    నీట్ పరీక్ష కోసం ప్రిపరేషన్ పూర్తిగా NCERT పాఠ్యపుస్తకాల నుండి ఉండాలని సూచిస్తున్నారు. NCERT పాఠ్యపుస్తకాలపై దృష్టి పెటి చదవితే అధిక మార్కులు మరియు మంచి ర్యాంక్ సాధించవచ్చంటున్నారు. సమయం తక్కువగా ఉండటం వల్ల కేవలం విద్యార్థులకు తెలిసిన వాటిపైనే దృష్టి సారించాలని… తెలియని వాటిని ముట్టుకోవద్దంటున్నారు మురళీకృష్ణ. చివరి నిమిషంలో ఇలా తెలియని టాపిక్స్‌ను పట్టుకుంటే గందరగోళం తప్ప ప్రయోజనం ఉండదంటున్నారు.



    దృష్టి సారించాల్సిన మరికొన్ని అంశాలు:
    1. ప్లాంట్ ఫిజియాలజీ. విభజన మరియు కణ జీవశాస్త్రం, జీవావరణ శాస్త్రం.
    2. మొక్కల అనాటమీ, బయో అణువు,
    3. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం.
    4. మొక్కల వైవిధ్యం.
    5. మొక్కల పునరుత్పత్తి మరియు స్వరూపం.

    పక్కా ప్రణాళికతో చదవాలి:

    ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌ నుంచి 40-42 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన వాటిలో 48-50 ప్రశ్నల వరకు సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ నుంచి రావచ్చంటున్నారు మురళీ కృష్ణ. గతంలో జరిగిన ఎగ్జామ్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేస్తూనే.. ప్రతి రోజు ఒక షెడ్యూల్‌ వేసుకుని..పక్కా ప్రణాళికతో చదివితే మంచి స్కోరు సాధించవచ్చని న్యూస్‌18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోటని లెక్చరర్‌ మురళీకృష్ణ తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Botany, Career and Courses, JOBS, NEET, NEET 2022, Neet exam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు