హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET-2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్ .. చెక్ చేసుకోవాల్సిన AIQ, స్టేట్ కోటా కౌన్సెలింగ్ వెబ్‌సైట్స్ లిస్ట్ ఇదే..!

NEET-2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్ .. చెక్ చేసుకోవాల్సిన AIQ, స్టేట్ కోటా కౌన్సెలింగ్ వెబ్‌సైట్స్ లిస్ట్ ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET-2022: ఎంసీసీ 15 శాతం AIQ (ఆల్ ఇండియా కోటా) సీట్లను విద్యార్థులకు కేటాయిస్తుంది. మిగిలిన 85 శాతం సీట్లకు, ప్రతి రాష్ట్రం ప్రత్యేక కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. AIQ, రాష్ట్ర కోటా కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులు చెక్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్స్ ను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నీట్ యూజీ- 2022 (NEET UG 2022) పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రకటించారు. దీంతో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలో నీట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయనుంది. ఎంసీసీ 15 శాతం AIQ (ఆల్ ఇండియా కోటా) సీట్లను విద్యార్థులకు కేటాయిస్తుంది. మిగిలిన 85 శాతం సీట్లకు, ప్రతి రాష్ట్రం ప్రత్యేక కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. AIQ, రాష్ట్ర కోటా కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులు చెక్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్స్ ను పరిశీలిద్దాం.

* నీట్-2022 ఆలిండియా కోటా కౌన్సెలింగ్ వెబ్‌సైట్స్

AIQ కౌన్సెలింగ్ కోసం ప్రధానంగా రెండు సంస్థల వెబ్‌సైట్స్ సందర్శించాల్సి ఉంటుంది. ఒకటి, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీకి చెందిన mcc.nic.in వెబ్‌సైట్ కాగా, మరోటి ఆయూష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీకి చెందిన aaccc.gov.in వెబ్‌సైట్.

* నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్

నీట్- ఆల్‌ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్ ప్రక్రియను నాలుగు రౌండ్‌లుగా విభజించే అవకాశం ఉంది. వీటిలో రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటాయి.

* నీట్-2022 స్టేట్ కోటా కౌన్సెలింగ్ వెబ్‌సైట్స్

జమ్మూ అండ్ కాశ్మీర్- jkbopee.gov.in, కర్ణాటక- kea.kar.nic.in, మధ్యప్రదేశ్- dme.mponline.gov.in, చండీగఢ్- gmch.gov.in, గోవా- dte.goa.gov.in, ఛత్తీస్‌గఢ్- cgdme.in, గుజరాత్- medadmgujarat.org, హర్యానా- dmer.haryana.gov.in, ఆంధ్రప్రదేశ్: ntruhs.ap.nic.in, జార్ఖండ్: jceceb.jharkhand.gov.in, ఉత్తరాఖండ్-hnbumu.ac.in, ఉత్తరప్రదేశ్- upneet.gov.in, పశ్చిమ బెంగాల్-wbmcc.nic.in,

కేరళ- cee.kerala.gov.in, అస్సాం-dme.assam.gov.in, అరుణాచల్ ప్రదేశ్- apdhte.nic.in, బీహార్-bceceboard.bihar.gov.in, మహారాష్ట్ర- cetcell.mahacet.org, మేఘాలయ- meghealth.gov.in, మణిపూర్- manipurhealthdirectorate.mn.gov.in, తమిళనాడు- tnmedicalselection.net, త్రిపుర-dme.tripura.gov.in, మిజోరం- mc.mizoram.gov.in నాగాలాండ్- dtenagaland.org.in, ఒడిశా- ojee.nic.in పుదుచ్చేరి- centacpuducherry.in, పంజాబ్- bfuhs.ac.in, రాజస్థాన్- ఈ రాష్ట్రానికి చెందిన వెబ్‌సైట్ త్వరలో ప్రకటించనున్నారు.

* అవసరమైన డాక్యుమెంట్లు

నీట్ -2022 అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కావచ్చు. దీంతో అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నీట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్(వర్తిస్తే), 10,12 తరగతుల మార్క్‌షీట్స్, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోస్ మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి.

* నీట్ ఫలితాల కంపారిజన్

నీట్-2022 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. గతేడాది ఫలితాలో పోల్చినప్పుడు పర్సంటైల్‌కు మార్కుల రేంజ్ ఈసారి తగ్గింది.అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 2021లో 50 పర్సంటైల్‌కు మార్కుల రేంజ్ 720-138 ఉండగా, 2022లో ఇది 715-117గా ఉంది.

ఇది కూడా చదవండి : ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే..

అలానే ఓబీసీ కేటగిరిలో 2021లో 40 పర్సంటైల్‌కు మార్కుల రేంజ్ 137-108 కాగా, 2022లో ఇది 116-93 మధ్య ఉంది. ఎస్సీ కేటగిరిలో 2021లో 40 పర్సంటైల్‌కు మార్కుల రేంజ్‌కు 137-108 కాగా, 2022లో ఇది 116-93 మధ్య ఉంది. అదే విధంగా ఎస్టీ కేటగిరిలో 2021లో 40 పర్సంటైల్‌కు మార్కుల రేంజ్‌కు 137-108 కాగా, 2022లో ఇది 116-93 మధ్య ఉంది.

* దాదాపు 10 లక్షల అభ్యర్థులు ఉత్తీర్ణత

నీట్-2022 పరీక్ష జులై 17న జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 18.5 లక్షల మంది అభ్యర్థులు నీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మొత్తంగా 9,93,069 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరి కోసం త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET 2022

ఉత్తమ కథలు