నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(National Eligibility Cum Entrance Test) - అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2022) రెండో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్(Registration) నవంబర్ 02, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్సైట్ mcc.nic.inలో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 07, 2022 వరకు రౌండ్ 2 కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఫీజు చెల్లింపు సౌకర్యం నవంబర్ 07 (03:00 PM) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో. నమోదు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 03 నుండి నవంబర్ 08 వరకు వారి ఎంపికను నమోదు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వెరిఫికేషన్ నవంబర్ 07 నుండి నవంబర్ 08, 2022 మధ్య సంబంధిత విశ్వవిద్యాలయాలు/సంస్థల ద్వారా చేయబడుతుంది. రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు నవంబర్ 11న విడుదల కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 12 నుండి నవంబర్ 18 వరకు అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్ట్ చేయవచ్చు .
కౌన్సెలింగ్ షెడ్యూల్..
-NEET UG 2022 రౌండ్ 2 కౌన్సెలింగ్ నమోదు మరియు చెల్లింపు ప్రక్రియ నవంబర్ 02 నుండి 07, 2022 వరకు
- ఎంపిక ఫిల్లింగ్/లాకింగ్ - 03 నుండి 08 నవంబర్ 2022 వరకు
- అభ్యర్థుల వెరిఫికేషన్ - 07 నుండి 08 నవంబర్ 2022 వరకు ఉంటుంది.
- సీట్ల కేటాయింపు ప్రక్రియ - నవంబర్ 09 నుండి 10 నవంబర్ 2022 వరకు.
-NEET UG రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితం - నవంబర్ 11, 2022
-కళాశాలల్లో రిపోర్టింగ్ - నవంబర్ 12 నుండి 18 నవంబర్, 2022 వరకు ఉంటుంది.
ఎలా నమోదు చేసుకోవాలి..
-ముందుగా అభ్యర్థి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ mcc.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- “UG మెడికల్ కౌన్సెలింగ్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-రిజిస్ట్రేషన్ కోసం లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
- అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి పోర్టల్ లో నమోదు చేయాలి.
-ఇప్పుడు లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపాలి.
-అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి.. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
-దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి
NEET UG కౌన్సెలింగ్ 2022 గురించి మరిన్ని వివరాల కోసం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET, NEET 2022, Neet exam