ఎట్టకేలకు నీట్ యూజీ (NEET UG 2021) ఫలితాల విడుదలపై ఉత్కంఠ వీడింది. ఫలితాల విడుదలపై బాంబే హైకోర్టు (High Court of Bombay) గతంలో స్టే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం (Supreme Court) తాజాగా స్టే విధించింది. దీంతో ఫలితాల (NEET PG Results) విడుదలకు మార్గం సుమగమైంది. గత సెప్టెంబర్ 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీటీ యూజీ (NEET UG 2021 Exam) పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష నిర్వహణ గందరగోళంగా సాగడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర(Maharashtra)తో పాటు రాజస్థాన్ లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న వార్తలు రావడంతో కేంద్రం స్పందించింది. ఈ అంశంపై నిజనిజాలను వెలికితీసేందుకు సీబీఐ(CBI) విచారణకు ఆదేశించింది. ఈ కేసు విషయంలో సీబీఐ కొందరిని అరెస్టు కూడా చేసింది. అయితే విచారణలో ఏం తేలిందన్న విషయం ఇంకా బయటకు రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర(Maharashtra)లో పరీక్ష(Exam)కు హాజరైన ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన టెస్ట్ బుక్ లెట్, ఓఎంఆర్ షీట్లు ఎగ్జామ్ సెంటర్లో తారుమారయ్యాయి. దీంతో ఆ అభ్యర్థులు తమకు నష్టం జరుగుతుందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది. ఆ బాధిత ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించిన అనంతరమే ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
TS ICET-2021 Counselling: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలివే
అయితే.. ఈ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తే అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టుకు NTA విన్నవించింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. 16 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాలను కేవలం ఇద్దరి కోసం నిలిపివేయడం సరికాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..
ఆ ఇద్దరి విద్యార్థుల సమస్యను మళ్లీ పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఫలితాలను విడుదల చేయాలని NTAకు ధర్మాసనం సూచించింది. అయితే ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 12కి వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exam results, Exams, NEET 2021, Supreme Court